ఓ రామా... అక్కడ సీత శరీరం పడి వుంది.. యమధర్మరాజు తచ్ఛాడుతున్నాడు...

భగవంతుని మీద నూటికి నూరుపాళ్లు విస్వాసం ఏర్పడినప్పుడు మనకు భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది. ఒకసారి హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు రాముడు హనుమను ఇలా అడిగాడు. హనుమా.... నువ్వు సీతను చూశావు కదా.. ఆమె ఎలా ఉందో కాస్త చెప్పు అని అడుగగానే అందుకు హను

బుధవారం, 29 ఆగస్టు 2018 (20:46 IST)
భగవంతుని మీద నూటికి నూరుపాళ్లు విస్వాసం ఏర్పడినప్పుడు మనకు భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది. ఒకసారి హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు రాముడు హనుమను ఇలా అడిగాడు. హనుమా.... నువ్వు సీతను చూశావు కదా.. ఆమె ఎలా ఉందో కాస్త చెప్పు అని అడుగగానే అందుకు హనుమంతుడు ఇలా బదులిచ్చాడు. 
 
ఓ రామా.. నేను అక్కడ కేవలం సీతాదేవి శరీరం మాత్రమే పడి ఉండటం చూశాను. ఆ శరీరంలో మనస్సు, ప్రాణం లేదు. తన మనో ప్రాణాలన్నింటినీ ఆమె నీ పాద పద్మాల వద్దనే సమర్పించింది. అందుకే కేవలం ఆమె శరీరం మాత్రమే అక్కడ పడి ఉండటం చూశాను. పైగా అక్కడ యమధర్మరాజు తచ్చాడుతుండటం నేను చూశాను. ఆయన మాత్రం ఏం చేయగలడు... అక్కడ ఉన్నది కేవలం శరీరం మాత్రమే. అందులో మనోప్రాణాలు లేవాయె...
 
నువ్వు దేని గురించి అయితే ధ్యానిస్తావో, అదే స్వభావం నువ్వు సంతరించుకుంటావు. రాత్రింబవళ్లు భగవచ్చింతన చేయడం వల్ల భగవంతుని స్వభావమే కలుగుతుంది. ఉప్పు బొమ్మ ఒకటి సముద్రపు లోతును కొలవడానికి వెళ్లింది. కాని అది సముద్రంలో ఒకటై పోయింది. పుస్తకాల, శాస్త్రాల లక్ష్యం కూడా భగవత్సాక్షాత్కారమే. ఒక వ్యక్తి ఒక సాధువుకు చెందిన పుస్తకాన్ని తెరిచి చూశాడు. అందులో ప్రతి పుటలోను కేవలం రామా అని మాత్రమే వ్రాయబడి ఉంది. అంతకుమించి మరేం లేదు.
 
భగవంతుని పట్ల ప్రేమ కలిగినట్లయితే కించిత్తు సూచనతోనే ఉద్దీపన కలుగుతుంది. అప్పుడు ఒక్కసారి రామా... అంటేనే కోటి సంధ్యల ఫలం దక్కుతుంది. మేఘాన్ని చూడగానే నెమలికి ఉద్దీపన కలుగుతుంది. ఆనందంతో పురివిప్పి నాట్యం చేస్తుంది. రాధాదేవికి కూడా అటువంటి అనుభూతే కలుగుతూ ఉండేది. మేఘం కళ్లబడగానే ఆమె మనస్సులో కృష్ణుడు మెదలేవాడు. అదే భగవంతుడిలో లీనమైన భక్తుడి పరిస్థితి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం స్త్రీలు బయట ప్రదేశాల్లో స్నానం చేయకూడదా.. శ్రీకృష్ణుడు అందుకే?