Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

సీతమ్మ తల్లి గరికను ఎందుకు ముట్టుకుందో తెలుసా? (video)

గరికను ముట్టుకుంటే.. పాపాలన్నీ పోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. సుందరకాండలో సీతమ్మ తల్లి.. భర్త పక్కన లేనప్పుడు కామవాంఛతో తనవంక చూస్తున్న రావణుడికి సీత జవాబు చెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఆ పా

Advertiesment
Importance
, మంగళవారం, 17 జులై 2018 (17:51 IST)
గరికను ముట్టుకుంటే.. పాపాలన్నీ పోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. సుందరకాండలో సీతమ్మ తల్లి.. భర్త పక్కన లేనప్పుడు కామవాంఛతో తనవంక చూస్తున్న రావణుడికి సీత జవాబు చెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఆ పాపం పోయేందుకు సీతమ్మ గరికను ముట్టుకుంది. అలాంటి మహిమాన్వితమైన గరికతో గణపతికి పూజించడం ద్వారా విశిష్ట ఫలితాలు పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
అందుకే వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభాలు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే చాలా ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడు. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
వినాయకునికి చతుర్థి పూజంటే మహాప్రీతి. ఈ తిథినాడు విఘ్నేశ్వరుడు ఉద్భవించాడు. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితిగా మనం గణపతిని పూజిస్తాం. అయితే ప్రతి మాసంలో వచ్చే చవితీ గణపతికి ప్రీతికరమే. భాద్రపద శుక్ల చవితి రోజున పార్వతీ-పరమేశ్వరులకు కుమారునిగా వినాయకుడు అవతరించినాడు. కానీ అంతకుముందే గణపతి ఉన్నాడు. ఆయన ఉపాసన కూడా ఉంది. 
 
బ్రహ్మదేవుడు సృష్టి ఆది నిర్వహణకు కలిగే విఘ్నాలు చూసి భయపడి, పరబ్రహ్మను ప్రార్థించాడు. ప్రణవ స్వరూపుడైన ఆ పరమాత్మ విఘ్నాల్ని నశింపజేయడానికి గజవదన రూపంలో సాక్షాత్కరించి తన వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించి, విఘ్నాల్ని హరింపజేస్తాడు. ఇది తొలి ఆవిర్భావమని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అందుకే... భయరోగాది కష్టాలు, సర్వ దారిద్ర్యాలు తొలగించే విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనది చతుర్థీ వ్రతం. ముఖ్యంగా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి ముఖ్యమైనది. ప్రతినెలా ఆ చతుర్ధికి గణపతిని ఉద్దేశించి ఉపవాసమో లేక ఉండ్రాళ్ళు, మోదకాలు వంటివి నివేదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
కృష్ణ చతుర్థినాడు దూర్వాలు, బిల్వాలతో, పువ్వులతో గణపతిని అర్చించి, 21 ఉండ్రాళ్లు నివేదన చేస్తే గ్రహదోషాలు, గృహదోషాలు తొలగిపోతాయంటారు. ఓం శ్రీ గణేశాయ నమః అంటూ 21 సార్లు ప్రతి నిత్యం, చతుర్థి నాడు పఠించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గడపపై తలపెట్టి పడుకుంటే... ఏం జరుగుతుందో తెలుసా?