Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంజనేయుడు శనీశ్వరుడిని తలపై ఎందుకు కూర్చోబెట్టుకున్నాడో తెలుసా? (video)

పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు. అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో వుంచుకోగలిగిన మహాశక్తిశాలి.. హనుమంతుడు. శ్రీ రాముడు లంకకు చేరుకునేందుకు గాను.. రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమ

Advertiesment
Story
, బుధవారం, 27 జూన్ 2018 (12:23 IST)
పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు. అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో వుంచుకోగలిగిన మహాశక్తిశాలి.. హనుమంతుడు. శ్రీ రాముడు లంకకు చేరుకునేందుకు గాను.. రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమగ్నమై వుండగా.. శనిభగవానుడు హనుమంతుడిని బంధించేందుకు వచ్చాడు. రెండున్నర గంటసేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు. 
 
''రెండున్నర గంట పాటు హనుమా నిన్ను చెరపట్టాలి. నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకివ్వమని అడుగుతాడు. అయితే రామసేతు నిర్మాణంలో తానుండగా.. చేస్తున్న పనికి ఆటంకం కలిగిస్తున్నావని హనుమ చెప్తాడు. అయినా నీకు నా తలభాగం ఇస్తాను. అక్కడ ఎక్కి కూర్చోమంటాడు. అంతే శని కూడా హనుమంతుడి తలపై ఎక్కి కూర్చుంటాడు. 
 
కానీ ఆంజనేయుడు రాళ్లను, కొండలను తన తలపై మోసాడు. భారం తాళలేక శనిభగవానుడు గగ్గోలు పెట్టగా, మాట తప్పకూడదు. రెండున్నర గంట సేపు అలానే వుండాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ రెండున్నర గంటకు తర్వాతే హనుమంతుడు శనీశ్వరుడు తల నుంచి శనీశ్వరుడిని కిందికి దించుతాడు. ఆపై రామ భక్తులను, ఆంజనేయ భక్తులను శనీశ్వరుడు ఇక్కట్లకు గురిచేయకూడదని హెచ్చరించాడు'' అలా శనీశ్వరుడి చెర నుంచి హనుమంతుడు తప్పుకున్నాడు. 
 
అలాంటి మహిమాన్వితుడైన హనుమంతునికి తులసీ మాలను సమర్పించుకుంటే శనిగ్రహ బాధల నుంచి గట్టెక్కవచ్చు. ఆంజనేయునికి రామనామం అంటే మహాప్రీతి. హనుమజ్జయంతి రోజున ''రామ రామ రామ'' అనే మంత్రాన్ని పఠించడం చేయొచ్చు. 
 
''ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్'' అనే మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా శనీశ్వర గ్రహ దోషాల నుంచి గట్టెక్కవచ్చు. హనుమజ్జయంతి రోజున తులసీమాల సమర్పించడం, తులసీ ఆకులతో అర్చన చేయడం ద్వారా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆ రోజున వడమాల సమర్పించడం, వెన్నతో ఆంజనేయుడిని అలంకరించడం, అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. 
 
మనోబలం, బుద్ధిబలం, శరీరబలం, ప్రాణ బలం కోసం ఆంజనేయ స్వామిని స్తుతించడం చేయాలి. ఆంజనేయ ఆరాధన ద్వారా వీరం, వివేకం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంట గదిలో సింక్ ఏ దిశలో ఉండాలంటే?