Webdunia - Bharat's app for daily news and videos

Install App

మితభాషికే విజయాలు వరిస్తాయి... ఇంకా....

వ్యక్తి యెుక్క పూర్వ కర్మల ఫలితాల ననుసరించి జయాపజయాలు, సాధనా నిస్పృహలు, ఆకర్షణలు పని చేస్తుంటాయి. ఈ వరుస క్రమంలో అన్ని జరుగువలసిందే.. అందరూ అనుభవించ వలసినవే. అవాంఛనీయ సంఘటనలు తటస్ధించినా వానిని చిరునవ్వుతో స్వీకరిస్తే మన జీవన భారం కొంత తేలిక పడుతుంది

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (21:29 IST)
వ్యక్తి యెుక్క పూర్వ కర్మల ఫలితాల ననుసరించి జయాపజయాలు, సాధనా నిస్పృహలు, ఆకర్షణలు పని చేస్తుంటాయి. ఈ వరుస క్రమంలో అన్ని జరుగువలసిందే.. అందరూ అనుభవించ వలసినవే. అవాంఛనీయ సంఘటనలు తటస్ధించినా వానిని చిరునవ్వుతో స్వీకరిస్తే మన జీవన భారం కొంత తేలిక పడుతుంది. 
 
1. ఇతరుల తప్పిదాలు అవి ఎంత చెడ్డవైనా వాని విషయం ఎన్నడూ ఎవ్వరితో ప్రసంగించకండి. దాని వల్ల ఉపయోగమేమీ లేదు. 
 
2. ద్వేషపూరిత హృదయానికి సంతృప్తి కలుగదు. ద్వేషం కార్చిచ్చు వంటిది. శాస్త్రాధ్యయనం వలన మానవుడు మేధావి కాలేడు. మహాత్ముల దైనందిక కార్యములందు సన్నిహితాన్ని పెంపొందించుకొనగలిగిన వాడే జ్ఞానియై రాణించగలడు.
 
3. దైవ చింతనతో గడుపుతున్న జీవితం స్వల్పకాలమైనా ఉత్తమమైనదే. దైవ భక్తి లేని జీవి లక్షలాది సంవత్సరాలు బ్రతికి ఉన్న ప్రయోజనం శూన్యమే.
 
4. కష్టపడి పనిచేయి. దేవుడు నామము ఉచ్చరించు. సద్గ్రంధాలు చదువు. వంతులకు, పోటీలకు పోవద్దు. అలా చేస్తే భగవంతునికి ఏహ్యం కలుగుతుంది.
 
6. మన సంభాషణయందు మనం సత్యాన్ని ఆచితూచి పలకాలి. సాధకుడు మితభాషిగా ఉండాలి. 
 
7. దైవాన్ని మరచిన వారికి బలహీనత కలుగుతుంది. పరమేశ్వరుని జ్ఞాపకముంచుకొనవలనంటే ఆయన మహిమను, నామాన్ని స్మరించడం అవసరం.
 
8. కష్టాలను అధిగమించితే మనకు నూతనుత్తేజం, ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు : నోటీసులిచ్చిన పోలీసులు

ఆత్మార్పణ చేసుకుంటే దేవుడుకి దగ్గరవుతాం... స్వర్గం ప్రాప్తిస్తుందంటూ మహిళ ఆత్మహత్య

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

తర్వాతి కథనం
Show comments