Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెంకాయ కొట్టిన తరువాత ఆ ఒక్కటి అందులో వేసి నైవేద్యం పెడితే..

కొబ్బరికాయ కొట్టేముందు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు. పూజ చేశాక కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న పద్ధతి, ఆచారం. పూజ పూర్తయిన తరువాత టెంకాయ కొట్టేశాం, నైవేద్యం పెట్టేశ

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (16:13 IST)
కొబ్బరికాయ కొట్టేముందు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు. పూజ చేశాక కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న పద్ధతి, ఆచారం. పూజ పూర్తయిన తరువాత టెంకాయ కొట్టేశాం, నైవేద్యం పెట్టేశాం, తంతు పూర్తయింది అని అనుకుంటూ ఉంటాం. అంతా బాగానే ఉంది. కానీ టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్ధతి ఉంది. 
 
టెంకాయ కొట్టడం శాంతి కారకం. అరిష్ట నాశకం. శాస్త్రం ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. టెంకాయ కొట్టేటప్పుడు స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశంలో పట్టుకోవాలి. టెంకాయ కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ దిశగా ఉండాలి. కాయి కొట్టేటప్పుడు 9 అంగుళాల ఎత్తు నుంచి కొట్టడం మంచిది. సరిగ్గా రెండు భాగాలుగా పగలాలి అంటారు. కొంచెం అటు, ఇటూ అయినా ఫర్వాలేదు. కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభం అనుక్కోనక్కర్లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరుగవు. అలా జరిగిన సమయంలో శివాయ నమహ అంటూ 108 సార్లు జపించాలి. 
 
కొంతమంది టెంకాయ కొట్టినా రెండు చిప్పలు చేతితో పట్టుకుని పూజ చేస్తుంటారు. అలా చేయకూడదు. అలాగే టెంకాయను కొట్టి ఒక గ్లాసులో ఆ నీటిని తీసుకొని వేరుగా ఉంచాలి. పాత్రలోని కొబ్బరి నీటితో మాత్రమే దేవుడికి సమర్పించాలి. ఇలా కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించేటప్పుడు పంచదార వేసి నైవేద్యంగా సమర్పిస్తే మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

23-05-2025 శుక్రవారం దినఫలితాలు - అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు...

22-05-2025 గురువారం దినఫలితాలు - పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది...

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

తర్వాతి కథనం
Show comments