మీ ఇంట్లో లక్ష్మీ కళ రావాలంటే..?
కొంతమంది ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటారో మనకు అర్థమైపోతుంది. ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుంది, పూజ గది ఏ విధంగా ఉంటుందో ఈజీగా తెలిసిపోతుంది. అతిథులను ఆహ్వానించడంలో భార్యాభర్తలు ఏ విధంగా వ్యవహరిస్తారో తెలుస్తుంది. మనం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్ప
కొంతమంది ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటారో మనకు అర్థమైపోతుంది. ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుంది, పూజ గది ఏ విధంగా ఉంటుందో ఈజీగా తెలిసిపోతుంది. అతిథులను ఆహ్వానించడంలో భార్యాభర్తలు ఏ విధంగా వ్యవహరిస్తారో తెలుస్తుంది. మనం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు ఇదంతా ఆ దేవుడు ఇచ్చింది అని చెబితే మాత్రం ఖచ్చితంగా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది.
అలాంటి వారు మాట్లాడుతుంటే వారి ఇంట్లో ఇంకొంచెం సేపు ఉండాలని అనిపిస్తుంటుంది. అయితే మరికొంతమంది ఇళ్ళలో మాత్రం అతిథులు వెళ్ళినప్పుడు కూడా గొడవలు పడుతుంటారు. చిన్నదానికి అరుచుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీ కళ కూడా ఆ ఇంట్లో కనిపించదు. సుఖదుఃఖాలనేవి అందరి జీవితంలో ఎప్పుడూ తొంగిచూసి వెళుతుంటాయి. అయితే వీటిని పట్టించుకోకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటూ సర్దుకుని పోతే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీకళ ఎప్పుడూ ఆ ఇంట్లో ఉంటుంది.