Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అజితేష్ అసభ్యంగా ప్రవర్తించాడు.. సింధు : ఇంకొక్కమాట చెప్పకంటున్న నెటిజన్స్

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబైకి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లిన ఆమెకు ఇండిగో విమానయాన సంస్థకు చెందిన గ్రౌండ్ సిబ్బంది అజితేష్ అనే వ్యక్

Advertiesment
అజితేష్ అసభ్యంగా ప్రవర్తించాడు.. సింధు : ఇంకొక్కమాట చెప్పకంటున్న నెటిజన్స్
, శనివారం, 4 నవంబరు 2017 (14:50 IST)
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబైకి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లిన ఆమెకు ఇండిగో విమానయాన సంస్థకు చెందిన గ్రౌండ్ సిబ్బంది అజితేష్ అనే వ్యక్తి నడుచుకున్నతీరుతో ఆమె కలత చెందారు. దీనిపై ఆమె చేసిన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, ప్లీజ్ సింధు, ఇంకొక్కమాట చెప్పకు అంటూ, ఓ కుటుంబాన్ని రోడ్డునపడేయకు అంటూ ప్రాధేయపడుతున్నారు. 
 
ఈ అంశంపై సింధు చేసిన ట్వీట్‌ను పరిశీలిస్తే, తాను ఈ ఉదయం (శనివారం) ముంబైకు బయలుదేరిన వేళ జరిగిన ఓ ఘటన తనకు చాలా బాధను కలిగించిందని కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ విషయం చెబుతున్నందుకు మన్నించాలని, తనకు అవమానం జరిగిందని పేర్కొంది. 
 
తాను ఇండిగోకు చెందిన విమానం 6ఈ608 ఎక్కాల్సి ఉందని, గ్రౌండ్‌స్టాఫ్‌లో అజితేష్ అనే వ్యక్తి, తనను అవమానించాడని తెలిపింది. ట్విట్టర్‌లో మూడు భాగాలుగా ఈ ట్వీట్ ఉందని చెబుతూ '1/3' అని మెసేజ్ చివర చూపుతోంది. కొద్దిసేపటి తర్వాత మిగిలిన రెండు భాగాలను కూడా తన ఖాతాలో పోస్ట్ చేసింది. వాటిలో ఒకదానిలో ఆషీమాతో మాట్లాడితే పూర్తి వివరాలు తెలుస్తాయని ఉంటే మూడో ట్వీట్‌లో ముంబై బదులుగా బాంబే అని రాసినందుకు క్షమించాలని కోరింది. అయితే, అజితేష్ అసభ్య ప్రవర్తనపై మాత్రం ఆమె స్పందించలేదు. 
 
ఇక ఈ ట్వీట్‌ను చూసిన ఆమె అభిమానులు, అజితేష్‌ను క్షమించాలని సలహా ఇస్తున్నారు. మరొక్క ట్వీట్ పెడితే, అతని ఉద్యోగం పోతుందని, నీ అంతటి స్టార్‌కు చేదు అనుభవాన్ని చూపినందుకు మరెక్కడా ఉద్యోగం లభించకుండా, అతని కుటుంబం రోడ్డున పడుతుందని అంటున్నారు. క్షమించి వదిలేస్తే సింధూ గొప్పతనం మరింతగా పెరుగుతుందని సలహా ఇచ్చారు. 
 
అంతేకాకుండా, ఇప్పుడున్న ట్వీట్‌ను డిలీట్ చేయాలని, అతనిపై కంపెనీకి నేరుగా ఫిర్యాదు చేస్తే సరిపోతుందని మరికొందరు అంటున్నారు. అతను ఓ చిన్న ఉద్యోగి కావచ్చని, సింధును ఏమైనా అంటే ఎంత దూరం పోతుందన్న విషయం తెలిసి ఉండకపోవచ్చని, క్షమించి వదిలేయమని మరికొందరు చెబుతున్నారు. ఇక ఈ స్పందనలను చూసిన సింధూ అసలేం జరిగిందన్న విషయాన్ని వెల్లడిస్తుందో? లేదో? వేచిచూడాల్సిందే. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడే కీలకమైన రెండో టీ20... సిరీస్ లక్ష్యంగా భారత్