భీమవరంలో అశ్లీలనృత్యాలు- బీజేపీ ఎంపీ గోకరాజు సోదరుడు స్టెప్పులు (వీడియో)
						
		
						
				
తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కళ వచ్చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందేలు, పేకాటలకు తోడు కిక్కు కోసం రికార్డింగ్ డ్యాన్సుల్ని కూడా ఏర్పాటు చేశారు. భీమవరంలో మహిళలచేత అశ్లీల డ్యాన్సులు చ
			
		          
	  
	
		
										
								
																	తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కళ వచ్చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందేలు, పేకాటలకు తోడు కిక్కు కోసం రికార్డింగ్ డ్యాన్సుల్ని కూడా ఏర్పాటు చేశారు. భీమవరంలో మహిళలచేత అశ్లీల డ్యాన్సులు చేయించారు. ఎంపీ గంగరాజు సోదరుల సమక్షంలో రికార్డింగ్ డ్యాన్సులు జరిగాయి. భీమవరం యూత్ క్లబ్ వార్షికోత్సవ కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఇకపోతే ఓ మహిళ డ్యాన్స్ చేస్తుండగా, పురుషులు డబ్బులివ్వడం, ఆమెతో కలిసి అశ్లీలంగా డ్యాన్స్ చేసే వీడియో వైరల్ అవుతోంది. అశ్లీల నృత్యాలపై మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ప్రజాప్రతినిధులై వుండి రికార్డింగ్ డ్యాన్స్ చేసే మహిళలతో కలిసి చిందులేయడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
 
									
										
								
																	
	 
	బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరుడు నరసింహ రాజు అశ్లీల నృత్యాలు చేస్తున్న కళాకారులతో కలిసి చిందులేసి ఎంజాయ్ చేశారు. దీనిపై ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మ మండిపడ్డారు.
 
									
											
							                     
							
							
			        							
								
																	ఇంకా వీడియోలను కూడా బయటపెట్టారు. భారతీయ సంస్కృతి మావేనంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు ఇలా చేయొచ్చా అని ప్రశ్నించారు. యువతను పెడదారి పెట్టేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఎంపీ గోకరాజు సోదరుడు నరసింహారాజు ప్రవర్తించారని సుంకర పద్మ ఆరోపించారు.