షిర్డి సాయిబాబా సందేశం

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (23:38 IST)
బాబా అందరికీ ప్రభువు, యజమాని. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. ఆడేవారు. పాడేవారు. దేవునికోసం అన్వేషణ మాని, మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలని బాబా చెప్పారు.

 
తోటివారిని ఏదో విధంగా బాధపెడుతూ, హింసిస్తూ దేవునికి పూజలు చేసినా ఫలితం ఉండదని, మంచి పనులు చేయడం ద్వారానే దేవునికి దగ్గర అవ్వాలని హితబోధ చేశాడు.  మానవ సేవే మాధవ సేవ అని ఎన్నోసార్లు గుర్తుచేశాడు. తోటివారిని విసిగించేవారు, బాధించేవారు పాపపు రాశులను పెంచుకుంటారని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని, తాము కష్టపడి అయినా, ఇతరులకు మేలు చేసేవారు జీవితాన్ని సార్ధకం చేసుకుంటారని స్పష్టం చేశాడు.

 
బాబా పెదవులపై 'అల్లామాలిక్' అనేది నిత్య భగవన్నామస్మరణ. ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగనిద్రలో ఉండేవారు. జగద్రక్షకుడు కదా.... బాబా అంతరంగం సముద్రమంత లోతు, ప్రశాంతం, గంభీరం. బాబా దర్బారు ఘనమైనది. వందలకొద్దీ ఉపదేశాలకు అది వేదిక. బాబాది సచ్చిదానంద స్వరూపం. సాయినాధుడు నిరుత్సాహం కానీ, ఉల్లాసం కానీ ఎరుగరు. ఎల్లప్పుడు ఆత్మానందంలో తేలియాడుతుండేవారు.

 
మన గురించి మనం ఆలోచించడం మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటివారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది. అన్నిటినీ మించి నేను, నాది అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గిపోతాయి. సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు. తనను వెతుకుతూ భక్తులు ఎక్కడికీ పోనవసరం లేదన్నారు. తాను ఈ ప్రపంచంలోని సకల జీవరాశుల్లో, వస్తువుల్లో, అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పారు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్ వైద్యుడు మత్తు ఇంజెక్షన్‌ వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.. ఎందుకని?

భోజ్‌పూర్‌లో యువకుడు ఎన్‌కౌంటర్.. ఐదుగురు పోలీస్ సిబ్బందిపై కేసు

సహజీవనం వద్దన్నారని ప్రియుడితో కలిసి తల్లిదండ్రులను అంతమొందిచిన కుమార్తె?

జూన్ 24, 2026 తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఎలా వుంది..?

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

తర్వాతి కథనం
Show comments