Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ పురాణం: 28 రకాల నరకాలుంటాయట.. ఆత్మపై ఆకలితో ఉన్న కుక్కలతో దాడి

సెల్వి
సోమవారం, 23 జూన్ 2025 (19:30 IST)
Garuda Purana
గరుడ పురాణంలో మన జీవితాల్లో చేసే పాపాలు, మరణాల తర్వాత ఆ పాపాలకు నరకం ఇవ్వబడే శిక్షల గురించి చెప్పబడింది. మానవాళి గరుడ పురాణం గురించి తప్పక తెలుసుకోవాల్సి వుంది. గరుడ పురాణం, హిందూ మతానికి చెందిన 18 మహా పురాణాలలో ఒకటి. ఇది మరణం, కర్మ, మరణానికి తర్వాత జరిగే విషయాలకు అంశాలకు లోతైన వివరణలను అందిస్తుంది.
 
విష్ణు భగవానుడు తన వాహనమైన గరుడునికి బోధించే సంభాషణలాగా ఈ  పురాణం ఉంటుంది. మానవులు నిజాయితీగా సన్మార్గంలో జీవించాలి. పాపాలకు దూరంగా వుండాలి. ధర్మ శాస్త్రాన్ని అనుసరించి గరుడ పురాణం ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. 
 
దొంగతనం చేసేవారు, దోచుకునేవారు, ఇతరులను మోసం చేసి తమ ఆస్తులను, సంపదలను పొందే వ్యక్తులు సారమేయాసనం శిక్షకు గురవుతారని నమ్మకం. ఈ నరలో తమ సామాజిక విధులను నిర్వర్తించని, సమాజాన్ని అగౌరవపరిచే వ్యక్తులకు చోటు. సారమేయాసనంలో ఆత్మపై ఆకలితో ఉన్న కుక్కలతో దాడి చేస్తాయి. ఇక్కడ జంతువులు ఆత్మ శరీరాన్ని పదే పదే చీల్చివేస్తాయని చెబుతారు.
 
గరుడ పురాణంలో, ఇతరుల వస్తువులను దొంగిలించడం, అపహరించడం చేయకూడదు. ఇది నేరం కింద వస్తుంది. ఈ పాపాలను చేసే వారికి మరుజన్మలో కష్టాలు తప్పవు. మరుజన్మలో వారు తమ జీవితాంతం ఆహారం, నీరు కోసం పోరాడవలసి వుంటుంది. దారిద్ర్యం వారిని వరిస్తుంది. 
 
యమలోకంలో వీరికి తప్త కుండల, సుర్మి వంటి నాగులతో ఇబ్బందులు తప్పవు. అసత్యం పలకకూడదు. వదంతులు వ్యాప్తి చేయకూడదు. ఇలా చేస్తే నోటి మాటరాకపోవడం వంటి శిక్షలు తప్పవు. వాస్తవానికి వివిధ పాపాలకు సంబంధించిన 28 రకాల నరకాలు, శిక్షలు గరుడ పురాణంలో ప్రస్తావించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments