Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?

social media Maniacs

ఐవీఆర్

, శనివారం, 9 నవంబరు 2024 (12:05 IST)
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారి కోసం పోలీసులు వేటాడుతున్నారు. వీరు ఏ పార్టీకి చెందినవారైనప్పటికీ వదిలే ప్రసక్తే లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే ఎలాంటి చట్టాల కింద వారిని అరెస్ట్ చేస్తారో తెలుసుకుందాము. సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడితే అలాంటి వారిని శిక్షించడానికి భారతదేశంలో అనేక చట్టాలు ఉన్నాయి, వాటిలో ప్రధానమైనవి ఇవే.
 
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 354 A, 354 D
సైబర్ బెదిరింపు, ఎవరినైనా తమ పోస్టులు ద్వారా వేధించడం చేస్తే ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. వీటిని క్రిమినల్ నేరాలుగా పరిగణిస్తారు. 354 A సెక్షన్ లైంగిక వేధింపుల కిందకి కూడా వస్తుంది. ఈ సెక్షన్ కింద లైంగిక ప్రయోజనాలను డిమాండ్ చేయడం, స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా అశ్లీల చిత్రాలను చూపడం వంటి తదితర నేరాలు వస్తాయి. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడతాయి.
 
IPC సెక్షన్ 499
ఈ సెక్షన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పరువు నష్టం కిందకి వస్తుంది. ఎవరైనా తమ పరువుకి భంగం కలిగించేలా వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా చేస్తే దీనిని "సైబర్ పరువు నష్టం" అంటారు.
 
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, సెక్షన్ 66 D
ప్రజలను మోసం చేయడానికి వాట్సాప్‌లో వేరొకరిలా పేరు మార్చుకుని నమ్మించడం, దూషించడం, మోసగించడం వగైరా నేరాలన్నీ ఈ విభాగం కిందికి వస్తుంది. ఈ నేరానికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. సోషల్ మీడియా దుర్వినియోగానికి గురైనట్లయితే, పోలీసు లేదా సైబర్ సెల్‌లకు క్రిమినల్ ఫిర్యాదు చేయవచ్చు. ఈ సమాచారం సోషల్ మీడియా నుంచి సేకరించబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిప్యూటీ సీఎం పవన్ దూకుడు: మైనింగ్, సోషల్ మీడియా సైకోల వెన్నులో వణుకు