Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా మందిరంలో పార్వతీపరమేశ్వరుని కుటుంబం ఫోటో వుంటే?

Webdunia
సోమవారం, 27 జనవరి 2020 (21:27 IST)
శివ కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరాలలో ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం కొందరికి కలుగుతుంటుంది. కానీ శివ కుటుంబంతో ఉన్న చిత్ర పటాన్ని పూజా మందిరంలో ఉంచడం చాలా మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. పార్వతీపరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు.

అన్యోన్య దాంపత్యానికి ఆదర్శమూర్తులు. పరమేశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తే, అమ్మవారు విజయాన్ని చేకూరుస్తుంది. తమ బిడ్డలను అనుగ్రహించడంలోను, ఆదరించడంలోను ఆ తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆలస్యం చేయరు. ఇక వినాయకుడు తనని ప్రార్థించిన వారికి ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూస్తాడు. 
 
విద్యాభివృద్ధిని కలిగిస్తాడు. కుమారస్వామి తేజస్సును, చైతన్యాన్ని కలిగిస్తాడు. జ్ఞానాన్ని పెంచడమే కాకుండా సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఇలా పార్వతీపరమేశ్వరులు, వినాయకుడు, కుమారస్వామి కుటుంబంలోని వారికి ఆయురారోగ్యాలను, విజయాలను, జ్ఞానాన్ని, చైతన్యాన్ని కలిగిస్తారు. అందువలన వాళ్లంతా కలిసి వున్న శివ కుటుంబ చిత్రపటం పూజా మందిరంలో ఉండటం చాలా మంచిదని అంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

తర్వాతి కథనం
Show comments