చంద్రబాబు అక్రమాస్తుల కేసుపై లక్ష్మీ పార్వతి పిటీషన్

శుక్రవారం, 24 జనవరి 2020 (19:45 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు చంద్రబాబు కలిగి ఉన్నాడని, ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్లో పేర్కొన్నారు.
 
చంద్రబాబుపై ఏసీబీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపించాలన్నది లక్ష్మీ పార్వతి  పిటీషన్. పిటీషన్‌ను విచారించిన ఏసీబీ కోర్టు... చంద్రబాబు పైన హైకోర్టులో ఉన్న స్టే వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హక్కులతో పాటు బాధ్యతలూ గుర్తెరగాలి: గవర్నర్