Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హక్కులతో పాటు బాధ్యతలూ గుర్తెరగాలి: గవర్నర్

Advertiesment
హక్కులతో పాటు బాధ్యతలూ గుర్తెరగాలి: గవర్నర్
, శుక్రవారం, 24 జనవరి 2020 (19:23 IST)
ప్రపంచ దేశాలలో గొప్పదైన భారత రాజ్యాంగం ప్రతీ పౌరునికి కొన్ని ప్రాధమిక హక్కులను ప్రసాదించిందని, అయితే పౌరులు ఆ హక్కులను వినియోగించుకుంటూ బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.

హక్కులను పొందే సందర్బాలలో బాధ్యతలను కూడా గుర్తేరిగి వ్యవహరించాలని సూచించారు. రాజమండ్రి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ 11, 12 స్నాతకోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

ఈ నేపధ్యంలో  విశ్వ విద్యాలయ కులపతి, గవర్నర్ బిశ్వభూషణ్ కీలక ఉపన్యాసం చేస్తూ భారత ప్రభుత్వం అమలు చేస్తున్న మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా కార్యక్రమాలను ప్రస్తావించారు.  దేశం కోరుకుంటున్న ఈ లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మక విద్యను అందించేందుకు చర్యలు చేపటట్టం ముదావహమన్నారు.

ప్రస్తుతం మనం పూజ్య బాపూజి 150వ జయంతోత్సవాలను నిర్వహించుకుటున్నామని, గాందీజీ 1921 సంవత్సరంలో విజయవాడను సందర్శించిన సందర్భంలో బాపూజీ ఇచ్చిన పిలుపుకు స్పందించి పింగిళి వెంకయ్య అశోక చక్రంతో కూడిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించారని, అది దేశ సమైఖ్యతకు నిదర్శనంగా నిలిచిందన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎంతో మంది పోరాటాలు చేసారని అయితే క్విట్ ఇండియా ఉద్యమంతో ప్రతీ ఒక్కరిలో చైతన్యాన్ని గాందీజీ రకిలించారని అన్నారు. అలాగే నేతాజీ వంటి ఎందరో మహనీయులు స్వాతంత్ర్య సాధనకు ప్రధాన భూమికను పోషించారని అన్నారు.

అయితే నేటి తరంలో మన దేశం అనే భావన కొరవడుతుందని  ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రతలో దేశాన్ని ప్రధమ స్థానంలో నిలిపెందుకు విద్యార్ధులు భాగస్వాములు కావాలని కోరారు.

కాలుష్యాన్ని అరికట్టడంలో, పచ్చదనం పెంపులో యువత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. పట్టబధ్రుల వినూత్న ఆలోచన దేశానికి ఎంతో అవసరమని, దేశ పర్యావరణానికి అది మరింత మేలు చేస్తుందని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు.

కార్యక్రమంలో భాగంగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తొలుత విశ్వవిద్యాలయం ఆవరణలో గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమ వేదిక వద్ద ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు, ఆర్.జి.కె.యు.టి చాన్సలర్ ఆచార్య కె.సి.రెడ్డి, విశ్వవిద్యాలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడే మొక్కలు నాటి,  రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

స్నాతకోత్సవ రోప్ తో స్నాతకోత్సవ మందిరానికి చేరుకున్నారు. ఆర్.జి.కె.యు.టి చాన్సలర్ ఆచార్య కె.సి.రెడ్డి కి నన్నయ విశ్వవిద్యాలయం తరుపున గౌరవ డాక్టరేటును గవర్నర్ ప్రధానం చేసారు. అలాగే 8 మందికి స్వర్ణ పతకాలు, 6కి పిహెచ్.డి లు 567 మందికి పట్టాలను ప్రదానం చేశారు.

విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం 435 అనుబంధ కళాశాలతో రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్ లతో విస్తరించి దాదాపు లక్షకు పైగా విద్యార్థులను కలిగి ఉందని అన్నారు.

ప్రతీ మూడు సంవత్సరాలకు ఒక సారి పాఠ్యాంశాలను విశ్వవిద్యాలయం సమిక్షిస్తుందని, విద్యతో పాటు క్రీడలు, ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాలోనూ తమ విశ్వవిద్యాలయం మంచి ప్రగతిని సాధిస్తుందని వివరించారు. రానున్న కాలంలో మరింత నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పరిశోధనపై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు.

అలాగే అత్యవసరంగా విశ్వవిద్యాలయంలో పరిశోధన సదుపాయాలను, మౌళిక సదుపాయలను మెరుగుపరచవలసిన అవసరం ఉందన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన రాజీవ్ గాందీ యూనివర్సిటీ ఆఫ్ నాలేజ్ టెక్నాలజీస్ చాన్సలర్ ఆచార్య  కె.సి.రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలలోనే భారత్ లో యువ జనాభ అధికమని ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని యువ భారత్ గా భావిస్తాయని చెప్పారు.

భారతదేశంలో 2030 నాటికి 140 మిలియన్లు జనాభా చేరుకుంటారని ప్రతీ నలుగురులో ఒక భారతీయుడు పట్టభద్రులుగా ఉంటారని చెప్పారు. ప్రపంచంలో చైనా, బ్రెజిల్, భారత్ దేశాలలో జనాభా అధికంగా ఉన్నపట్టికి మిగిలిన రెండు దేశాలలో పోల్చి చూస్తే మన దేశంలో ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. 

ప్రతీ జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న వై.ఎస్.ఆర్ ఆలోచనలలో భాగంగా గోదావరి జిల్లా వాసుల కోసం నన్నయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసారని అన్నారు. అలాగే ఎందరో పేద విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించడానికి కూడా వై.ఎస్.ఆర్ ప్రారంభించిన ఫీజు రియింబర్స్.మెంట్ కారణమని చెప్పారు.

అతి స్వల్ప కాలంలోనే నన్నయ యూనివర్సిటీ ఎంతగానో అభివృద్ది చెందిందని ఇందుకు విద్యార్థులే ముఖ్య కారణమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న విద్య అవకాశాలను సద్వినియోగం పరచుకొని ప్రయోజనం పొందాలని చెప్పారు.

ఉద్యోగవకాశాలకు కొదువ లేదని అయితే అందుకు అవసరమైన నైపుణ్యాలను, సామర్ధ్యాలను యువత పెంపొందించుకుంటే అవకాశాలను అందిపుచ్చుకోగలరని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, రెక్టార్ ఆచార్య పి.సురేష్ వర్మ, రిజిష్ట్రార్ ఆచార్య ఎస్.టేకి, ప్రిన్సిపల్స్ డా.కె.శ్రీరమేష్, డా.కె.రమనేశ్వరి, డా.వి.పెర్సిస్, డా.కె.సుబ్బారావు డీన్స్ వై.శ్రీనివాసరావు, డా.ఎ.మట్టారెడ్డి, కంట్రోల్ ఎగ్జామ్నేషన్స్ ఎస్.లింగారెడ్డి,

డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డా.డి.జ్యోతిర్మయి, డా.కళ్యాణి, ఎంపి మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసిపి నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, జి.ఎస్.ఎల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావు, విశ్రాంత ఉపకులపతులు ఆచార్య పి.జార్జివిక్టర్, ఆచార్య సుంకరి రామకృష్ణారావు, అకడమిక్ సెనేట్ సభ్యులు, గోదావరి సాధన సమితి సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్సార్, నేను ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకున్నాం.. చంద్రబాబు