Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అష్టమి తిథినాడు పూజ ఎలా..? నువ్వుల దీపంతో? (video)

Advertiesment
అష్టమి తిథినాడు పూజ ఎలా..? నువ్వుల దీపంతో? (video)
, శుక్రవారం, 17 జనవరి 2020 (14:20 IST)
అష్టమి తిథి అమ్మవారికి, పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైన రోజు. అష్టమి తిథి జనవరి 17 ఉదయం 07.28 గంటల నుంచి జనవరి 18 ఉదయం 05.33 గంటల వరకు వుంటుంది. ఈ సమయంలో శివాలయాల్లోని కాలభైరవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా అభీష్టాలు నెరవేరుతాయి. అష్టమి రోజున కాలభైరవుని పూజ ద్వారా కాలాన్ని అనుకూలంగా మలచుతాడని విశ్వాసం. 
 
కాలభైరవ ఆలయాల్లో జరిగే అభిషేకాలలో పాల్గొనడం.. పాలతో తయారు చేసిన అన్నాన్ని నలుగురికి పంచి పెట్టడం ద్వారా శనిదోషాలు, ఈతిబాధలు తొలగిపోతాయి. శునకాలకు పాలు, పెరుగుతో చేసిన అన్నాన్ని పెట్టడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. కాలభైరవునిని పూజించడం ద్వారా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. కాలభైరవుడు దేవాలయాలకు, ప్రయాణీకులను కాపాడే దైవంగా పరిగణింపబడతాడు. అలాంటి దైవాన్ని అష్టమి రోజున పూజించడం ద్వారా ఇబ్బందులను తొలగించుకోవచ్చు. 
 
ఇంకా ఆరోగ్య పరమైన ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే అష్టమి రోజున ఈశ్వర ఆరాధన చేయడం మంచిది. అమ్మవారిని కూడా ఈ రోజున పూజించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. చర్మ వ్యాధులు, వాత వ్యాధులను తొలగించుకోవాలంటే.. అష్టమి పూజ చేయాలి. అనారోగ్య ఇబ్బందులను తొలగించుకోవాలంటే.. అష్టమి రోజున నమక చమక ఆరాధనతో పాటు అభిషేకాలు చేయించాలి. 
 
హోమాలు చేయించడం ద్వారానూ సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. అష్టమూర్తి, అష్టతనువు కలిగిన శివమూర్తిని పూజించడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుతాడని విశ్వాసం. ఇంకా సర్వ ఉపద్రవ నివారణ్యేనమ: అనే మంత్రాన్ని సప్తమినాడు పఠించడం ద్వారా సర్వ అనారోగ్యాలు తొలగిపోతాయి. 
 
శనిదోషాలు తొలగిపోవాలంటే.. అష్టమి తిథికి యజమాని అయిన శివరాధన చేయాలి. అలాగే అష్టమి తిథినాడు.. పరమేశ్వరుని అంశ అయిన ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17-01-2020 శుక్రవారం దినఫలాలు - మహాలక్ష్మిని ఎర్రని పూలతో పూజించినా...