Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరమేశ్వరుడినే బెదిరించిన భక్తుడు, చివరికి ఏమయ్యాడు?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (21:23 IST)
రుద్రపశుపతి అనే గొప్ప భక్తుడు అమాయకుడు. ఈతడు ప్రతిరోజూ శివలయానికి వెళుతుంటాడు. అక్కడ కథలూ, పురాణాలు వింటూ వుండేవాడు. ఎవరు ఏ కథ చెప్పినా దాన్ని నిజమేనని నమ్మేవాడు. ఇక పురాణాలల్లో భగవంతుని లీలలు వింటూ తరించేవాడు. అలా ఓ రోజు గుడిలో హరికథా కాలక్షేపం జరుగుతోంది. ఆ కథలో శివుడు క్షీరసాగరమథన సమయంలో హాలాహలం రాగా ఆ విషాన్ని లోక కళ్యాణం కోసం ఓ గుళికలాగా మింగేశాడు.
 
అది స్వామి కంఠంలోనే ఉండిపోయింది. అందుకే ఆయనకు గరళకంఠుడు అనే పేరొచ్చింది అని చెప్పుకుంటూపోతున్నాడు. ఆ కథ విని ఆ భక్తుడు.. అయ్యో... ఎంతపని జరిగింది. అంతమంది దేవతలుండగా శివుడే ఎందుకు దాన్ని మింగాడు. పాపం ఆ విషం కంఠంలో ఉంచుకుని ఎంత బాధపడుతున్నాడో కదా అంటూ వేగంగా శివాలయానికి వెళ్లాడు.
 
అక్కడ ఉన్న స్వామి వద్దకు వెళ్లి స్వామీ... నువ్వు విషం మింగావట కదా. ఆ విషాన్ని ఉమ్మెయ్యి. ఉమ్ముతావా లేదా అంటూ హఠం వేసుకుని స్వామి ఒడిలో కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఊరకే ఉండక ఒక పదునైన కత్తి తీసుకొని తన కంఠానికి ఆనించుకుని, నువ్వు ఆ విషాన్ని కనుక ఉమ్మెయ్యకపోతే నేనిక్కడే నా కంఠాన్ని ఈ కత్తితో నరుక్కుంటాను అని స్వామిని బెదిరించాడు.
 
ఆ అమాయక భక్తుడు అంతపనీ చేసేలాగున్నాడని శివుడు అతని భక్తికి ప్రత్యక్షమై అతణ్ణి తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇలా ఒకరూ, ఇద్దరూ కాదు, ఎందరో అమాయక భక్తులు స్వామిని నిష్కల్మషభక్తితో సేవించి తరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

తర్వాతి కథనం
Show comments