Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు రాష్ట్రాల్లో గుడికో గోమాత, త్వరలో కల్యాణమస్తు ప్రారంభం: టిటిడి ఛైర్మన్

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (17:54 IST)
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోందని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. విజయవాడ సెంట్రల్ పరిధిలోని సత్యనారాయణపురం లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గురువారం గుడికో గోమాత కార్యక్రమం నిర్వహించారు. 
 
శ్రీ గాయత్రి సొసైటీ వారు ఆలయానికి కపిల గోవును బహూకరించారు. టీటీడీ చైర్మన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శాస్త్రోక్తంగా గోపూజ చేసి ఆలయానికి గోవును అందించారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించిందన్నారు. 
 
దేశ వ్యాప్తంగా ఏ ఆలయం అయినా టీటీడీని కోరితే ఈ కార్యక్రమం ద్వారా ఆలయానికి గోమాత, దూడను అందిస్తుందన్నారు. వీటి పోషణ భాద్యత ఆ ఆలయమే తీసుకోవాలని చైర్మన్ చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం టీటీడీ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ఆయన చెప్పారు.
 
గత ప్రభుత్వం మంగళం పాడిన కళ్యాణమస్తు కార్యక్రమం త్వరలో ప్రారంభించబోతున్నామన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో త్వరలోనే 500 దేవాలయాలను నిర్మిస్తామని తెలిపారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమం ఆలస్యమైందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

తర్వాతి కథనం
Show comments