Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడు చాలా తెలివైనోడు.. ఇదే సగటు మనిషి బతుకు...

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (12:04 IST)
దేవుడు తెలివైనోడు. బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే, తీసి స్కూల్‌లో వేస్తాడు. అప్పటి నుంచి ఒత్తిడి ప్రారంభమవుతుంది. స్కూల్ అయిపోయి కాలేజీలో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే బాధ్యత గుర్తు చేస్తాడు. సరే జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డబ్బు మీద ఆశను పుట్టిస్తాడు. డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే, లాగిపెట్టి ఒకటి పీకి, ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తు చేస్తాడు. 
 
శక్తి లేనప్పుడు మనల్ని చూసుకోవడానికి ఎవరుంటారు అనుకున్నప్పుడు భార్యని పంపిస్తాడు. సరే భార్యా-పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పిల్లల భవిష్యత్తు అంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే, ప్రేమని కోల్పోతున్నాం అని గుర్తు చేస్తాడు. కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని మనిషి ఈ సారి దేవుడి మాట వినడు. కట్టల కొద్దీ పైసలు కూడబెడతాడు. 
 
హమ్మయ్య అని ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడితో ఆడుకోడానికి ఎవరూ ఉండరు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. సరే పిల్లలకు పెళ్ళి చేసి, కనీసం వాళ్ళ పిల్లలతో అయినా ఆడుకుందాం అనుకుంటే, వాడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అని ఎక్కడికో ఎగిరిపోతారు. కొందరు పిల్లలు ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళను తీసి అనాథ శరణాలయంలో పడేస్తారు. 
 
శక్తి మొత్తం క్షీణించి, ఏమీ చేయలేని ముసలి వయసులో జీవితం కళ్ళ ముందు కదలాడుతుంది. తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయ్. అప్పుడొస్తాడు దేవుడు, ఏడ్చింది చాలు నాయనా! నీ టైం అయిపోయింది వెళ్దాం పదా అని తీసుకెళ్లిపోతాడు. ఇదే సగటు మనిషి బతుకుతున్న జీవితం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

తర్వాతి కథనం
Show comments