Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలను అతిగా హత్తుకుంటున్నారా... వద్దనే వద్దు...

పిల్లలను అతిగా హత్తుకుంటున్నారా... వద్దనే వద్దు...
, బుధవారం, 5 డిశెంబరు 2018 (16:26 IST)
'బుజ్జీ.. మామయ్యకి ఓ హగ్ ఇవ్వు', అత్త నీకోసం చాక్లెట్ తెచ్చింది.. ఓ ముద్దు ఇవ్వు' అనే మాటలు తరచూ వింటుంటాం. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినపుడు పిల్లలు వాళ్ళ వద్దకు వెళ్లడానికి ఇష్టపడరు. వారివద్దకు వెళ్లకుండా తల్లిదండ్రుల చాటుకు వెళుతుంటారు. అయినప్పటికీ హిల్లలతో బలవంతంగా ముద్దులు, హగ్ ఇప్పిస్తుంటారు. అయితే, ఇలా ఇప్పించడం వల్ల చిన్నారులు కుంగిపోతారని మానసిక పరిశోధకులు అంటున్నారు. 
 
పిల్లలు ఇష్టపూర్వకంగా దగ్గరకు వెళ్తే ఫర్వాలేదుగానీ, వారిని బలవంత పెడితే మానసికంగా ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉందని మానసిన వైద్యులు చెప్తున్నారు. పైగా ఇది అంత ఆరోగ్యకరం కూడా కాదని హెచ్చరిస్తున్నారు. అయిష్టంగా కౌగిలింతలు ఇప్పించడం ద్వారా పిల్లలకు వారి శరీరాల పట్ల అధికారం లేదని భావించే అవకాశం ఉంది. 
 
అంతేకాకుండా కొత్త వ్యక్తిని పలకరించడానికి కేవలం హగ్ లేదా ముద్దు మాత్రమే మార్గం అని నమ్మే ప్రమాదమూ ఉంది. దీనికి బదులు పిల్లలకి నమస్కారం, కరచాలనం వంటివి అలవాటు చేయడం మంచిదనేది నిపుణుల సలహా. శారీరక చర్య ఏదైనా పూర్తిగా పిల్లల ఇష్టానికే వదిలేయడం మంచిది. పిల్లల శరీరం పట్ల వారికి పూర్తి హక్కు ఉంటుంది. ఇష్టం లేని చర్యల ద్వారా ఆత్మన్యూనతాభావానికి లోనయ్యే అవకాశం ఉందని, అందువల్ల అలా ఎపుడూ చేయించవద్దని వైద్యులు కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా గర్ల్ ఫ్రెండుతో అలా చేస్తూ ఆపుకోలేకపోయా... గబుక్కున తలుపు తీసింది...