Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయినా అతడే నాకు కావాలనిపిస్తోంది... ఏం చేయాలి?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (16:58 IST)
ఏడాది క్రితం పెళ్లయిన కొత్త జంట మా ఇంటికి ప్రక్కనే అద్దెకు దిగారు. వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉంటారు. ఇల్లు అద్దెకు దిగాక ఓ పండుగ ఫంక్షనుకు ఆమె మమ్మల్ని పిలిచారు. అమ్మ, నేను వెళ్లాము. వారి ఇంటికి వెళ్లగానే ఆమె భర్త పలుకరింపుగా నవ్వుతూ మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు. ఎందుకో... ఆ నవ్వు సూటిగా నా గుండెల్లో గుచ్చుకున్నట్లనిపించింది. ఫంక్షన్ జరుతున్నంతసేపూ అతడినే చూస్తూ ఉండిపోయాను. 
 
ఆ తర్వాత కూడా అతడంటే ఎందుకో నాకు తెలియని ఇష్టం ఏర్పడింది. ఇంట్లో నుంచి ఎప్పుడు అతడు బయటకు వస్తాడా అని చూసిన రోజులు చాలా ఉన్నాయి. అతడికి 30 ఏళ్లుంటాయి. నా వయసు 20. అతడు నవ్వు నాకు కావాలనిపిస్తోంది. అతడి నవ్వుతో పాటు అతడు కూడా కావాలని మనసు ఉవ్విళ్లూరుతోంది. 
 
ఐతే అతడి భార్య అమ్మ దగ్గరకు వచ్చిపోతుంటుంది. నాలో రేగిన ఆలోచనలు ఆమెను చూసినప్పుడు ముడుచుకుపోతాయి. ఆమె చాలా మంచివారు. ఆమె భర్తను నేనిలా ఊహించుకోవడం చాలా తప్పు అనిపిస్తుంది. కొన్ని గంటలు మాత్రమే అలా ఉంటాను. ఐతే మళ్లీ మరుసటి రోజు నుంచి మామూలే. ఈ పిచ్చి ఆలోచనల నుంచి నేను బయటపడే మార్గం ఏమిటి...?
 
మంచి మనసు, మంచి ఆహ్లాదకరమైన నవ్వు, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులు... అంటే, వారు స్త్రీ లేదా పురుషుడు... ఎవరైనా కావచ్చు. వారంటే సహజంగా ఇష్టం ఏర్పడుతుంది. ఐతే ఆ ఇష్టం అంతవరకే ఉండాలి. కానీ పరాయి స్త్రీ భర్తను కావాలనుకునే స్థాయికి వెళ్లకూడదు. కనుక మీరు మరీ అతడి ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నట్లయితే కొన్నాళ్లు మీ బంధువుల ఇంటికి వెళ్లండి. మనసును కెరీర్ పైన నిలిపి, మీ తల్లిదండ్రులు మీపై ఉంచిన ఆశలను నెరవేర్చేందుకు నడుం బిగించండి. అవన్నీ మీ కళ్లముందు ఉంటే ఇలాంటి పక్కింటి పురుషుని నవ్వులన్నీ మీ ముందు మరుగుజ్జులా మారిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

తర్వాతి కథనం
Show comments