Washing Hands in Plate? భోజనం చేసిన తర్వాత కంచంలోనే చేతులు కడిగేస్తున్నారా?

సెల్వి
సోమవారం, 2 జూన్ 2025 (19:37 IST)
భోజనం చేసిన తర్వాత చాలామంది కంచంలోనే చేతులు కడిగేస్తుంటారు చాలామంది. కొందరైతే తిన్న కంచంలో అన్నం వున్నా పట్టించుకోకుండా అందులోనే కడిగేయడం చేస్తుంటారు. 
 
పద్ధతిగా భోజనం చేయడం, ఆహారాన్ని మిగల్చకుండా చేయడం.. ఆపై తిన్న కంచాన్ని శుభ్రంగా కడిగిపెట్టడం చేయాలి. అలా చేయకుండా ఆధ్యాత్మికపరంగానూ, ఆరోగ్యపరంగానూ నష్టమేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అవును ఆహారం వడ్డించే పాత్రల్లో లక్ష్మీదేవి నివాసం వుంటుందని చెప్తారు. 
 
అందుచేత భోజనం చేసిన పాత్రల్లోనే చేతుల్ని కడిగితే అది అశుభ్రతకు సంకేతం. అశుభ్రత వున్నచోట లక్ష్మీదేవి వుండదు. అందుచేత తిన్న కంచంలోనే కడిగితే లక్ష్మీ కటాక్షం అంతంత మాత్రమే. 
 
అలాగే ఆహారం తీసుకునే ప్లేటులోనే కడగటం మంగళప్రదం కాదు. ఇది అన్నపూర్ణమ్మను అవమానించినట్లు అవుతుంది. అలాగే కంచంలోనే చేతులు కడిగే వ్యక్తిపై ప్రతికూల ప్రభావాలుంటాయి. ఇంకా పేదరికం, ఇతర రకాల దురదృష్టాలు సంభవించవచ్చు.
 
అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కంచంలోనే చేతులు కడగటం ద్వారా ఆ ఇంట ఆహార కొరత ఏర్పడే అవకాశం వుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆహారాన్ని మిగలపెట్టడం అశుభంగా పరిగణించబడుతుంది.
 
భోజనం చేసే ముందు దేవతలను ధ్యానించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆహారం తీసుకునేటప్పుడు పద్ధతిగా చాపపై కూర్చుని తీసుకోవాలి. ఆహారం తినేటప్పుడు, కోపం, సంభాషణ లేదా వింత శబ్దాలు చేయకూడదు. ప్రశాంతంగా భోజనం చేయాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

19న జనవరి కోటా శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

సంపదలను తెచ్చే ధన త్రయోదశి, విశిష్టత ఏమిటి?

17-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు విపరీతం.. ఆప్తులతో సంభాషిస్తారు...

అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో తెప్పోత్సవం.. ఎప్పుడో తెలుసా?

Diwali 2025: దీపావళి రోజున లక్ష్మీనారాయణ రాజయోగం, త్రిగ్రాహి యోగం.. ఇంకా గజకేసరి యోగం కూడా..!

తర్వాతి కథనం
Show comments