Webdunia - Bharat's app for daily news and videos

Install App

03-05-2020 నుంచి 09-05-2020వ తేదీ వరకు వార రాశిఫలాలు

Webdunia
శనివారం, 2 మే 2020 (22:25 IST)
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సహాయం ఆశించవద్దు. బంధువుల వైఖరి అసహనం కలిగిస్తుంది. సోమ, మంగళవారాల్లో ఓర్పుతో వ్యవహరించండి. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఒక వ్యవహారంలో మీ ప్రమేయం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. రిటైర్డు ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం ఊరట కలిగిస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ధనలాభం ఉంది. అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు విపరీతం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బుధవారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. పట్టుదలతో ముందుకుసాగిండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. అప్రియమైన వార్తలు వింటారు. కార్యక్రమాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు ఆదాయాభివృద్ధి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వు 1, 2, 3 పాదాలు. 
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ నమ్మకం వమ్ముకాదు. బాధ్యతగా వ్యవహరించాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పొగడ్తలు, ప్రలోభాలకు లొంగవద్దు. బుధవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. రాబడిపై దృష్టిపెడతారు. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు హోదా, మార్పు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహనం ఇతరులకివ్వద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. 
అనుకూలతలున్నాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. బంధుత్వాలు అధికమవుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు అర్థాంతరంగా నిలిపి వేయవలసి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. సంతానం ఉన్నత చదువులకు వారి ఇష్టానికే వదిలేయండి. పోగొట్టుకున్న పత్రాలు సాధిస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ప్రకటనలను విశ్వసించవద్దు. వృత్తి వ్యాపారాల్లో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవుల స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. సాధ్యంకాని హామిలివ్వవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నగదు, అభరణాలను జాగ్రత్త. శనివారం నాడు కావలసిన వ్యక్తుల కీలయిక వీలుపడదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహమార్పు అనివార్యం. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధికమిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హిస్త, చిత్త 1, 2 పాదాలు. 
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. పదవుల దక్కకపోవచ్చు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనంమితంగా వ్యయం చేయండి. ఆది, సోమవారాల్లో పనులతో సతమతమవుతారు. ఆత్మీయులరాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. పంతాలకు పోవద్దు. సంతానం, ఉన్నత చదువులపై శ్రద్ధ అవసరం. ప్రకటనలను విశ్వసించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యాంలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను అధికమిస్తారు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్‌లో మెలకువ వహించండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సాయం అర్థించేందుకు నమస్కరించదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. మంగళవారం నాడు ఏ విషయంపై ఆసక్తి వుండదు. స్థిమితంగా వుండేందుకు ప్రయత్నించండి. బంధువులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల కొత్త బాధ్యతలు, పనిభారం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. విద్యార్థులకు దూకుడు తగదు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట. 
మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆపన్నులకు సాయం అందిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ప్రత్యర్థులతో జాగ్రత్త. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. బుధ, గురువారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు, ఆహ్వానం అందుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు శుభయోగం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
సమర్థతను చాటుకుంటారు. మీ కష్టం వృధా కాదు. మొండి బాకీలు వసూలవుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అవివాహితులకు శుభయోగం. దంపతుల సఖ్యత నెలకొంటుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. అపరిచితులతో మితంగా సంభాషించండి. వాగ్వాదాలు, పట్టుదలకు పోవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సంస్థల స్థాపనలకు అనుకూలం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మకరం: ఉత్తారాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
ఈ వారం పరిస్థితులు క్రమంగా నెరవేరుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపుల స్థల మార్పు అనివార్యం. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం తక్కువ. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. సన్నిహితుల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. శుక్ర, శనివారాల్లో ఓర్పుతో వ్యవహరించాలి. పనులు సాగక విసుగు చెందుతారు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. 
  
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. 
వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు లోటుండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆదివారం నాడు పనుల్లో అవాంతరాలెదురవుతాయి. మొండిగా వ్యవహరిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దంపతుల మధ్య దాపరికం తగదు. వాగ్వాదాలకు దిగవద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. రిటైర్డ్ ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన : మంత్రి టీజీ భరత్

తమ్ముడి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు నాయుడు (Video)

ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లు నెలకు ఒకసారైనా ఉతుకుతారు : రైల్వే మంత్రి

కేరళ సంప్రదాయ చీరకట్టులో ప్రియాంక.. లోక్‌సభ సభ్యురాలిగా... (Video)

ప్రియురాలిని హత్య చేసి ఆమె శవం పక్కనే 24 గంటలు, ఆ తర్వాత?

అన్నీ చూడండి

లేటెస్ట్

వృశ్చికరాశి జాతకం 2025.. కెరీర్, ఉద్యోగం ఎలా వుంటుంది..?

2025 రాశి ఫలితాలు.. ఏ రాశికి శుభం.. చాలామంది మాంసాహారం మానేస్తారట!

27-11-2024 బుధవారం ఫలితాలు - ప్రముఖుల సలహా పాటిస్తే మంచిది..

టిటిడికి రూ. 2.02 కోట్లు విరాళం కానుకగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

తర్వాతి కథనం
Show comments