Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 20 April 2025
webdunia

26-04-2020 నుంచి 02-05-2020 వరకు మీ వార రాశి ఫలాలు

Advertiesment
Weekly Horoscopes
, శనివారం, 25 ఏప్రియల్ 2020 (17:50 IST)
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కొత్త పనులు ప్రారంభిస్తారు. పత్రాల రెన్యువల్‌లో మెళకువ వహించండి. ఆహ్వానం అందుకుంటారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకుసాగవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వ్యవహారాల్లో మెళకువ వహించండి. సాధ్యం కాని హామీలు ఇవ్వొద్దు. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. నగదు విత్ డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధనం. ప్రయాణం విరమించుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పొదుపు ధనం గ్రహిస్తారు. అవసరాలు నెరవేరుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. శుక్రవారం కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. విమర్శలు పట్టించుకోవద్దు. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ధైర్యంగా ముందుకుసాగుతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు బలపడతాయి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మార్కెట్ రంగాల వారికి అదాయాభివృద్ధి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వుసు 1, 2, 3 పాదాలు. 
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణ ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. అవసరాలు నెరవేరవు. ఆత్మీయుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. శని, ఆదివారాల్లో పనులతో సతమతమవుతారు. సాధ్యంకాని హామీలు ఇవ్వొద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఒక సమాచారం. ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం సంతృప్తినిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. రిటైర్డ్ ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కార్యసిద్ధి. ధనయోగం ఉన్నాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. సోమ, మగళవారాల్లో అనవసర జోక్యం తగదు. పరిచయంలేని వారితో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు హోదా మార్పు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. విలాస వస్తువులు కొనుగోలుచేస్తారు. ఆశయం నెరవేరుతుంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. పరిచయాలు అధికమవుతాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యవహారాల్లో మీదే పైచేయి. పత్రాలు రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. బుధ, గురువారాల్లో బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగాలి. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహాది శుభకార్యాలకు వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. శుక్ర, శనివారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థుల కదలికలను గమనించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాతంగా సాగుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఈ వారం ప్రతికూలతలు అధికం. ఓర్పుతో వ్యవహరించాలి. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. పనులతో సతమతవుతారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సమయపాలన ప్రధానం. జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యోష్ట 
గృహమార్పు కలిసివస్తుంది. పనులు సానుకూలమవుతాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. సమ్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ పట్టుదల ఎదుటివారికి ఆసక్తి కలిగిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టుగా వదిలివేయాలి. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. పరిచయం లేనివారితో జాగ్రత్త. ఆరోగ్యం బాగుటుంది. ప్రియతములకు ముఖ్య సమాచారం అందిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వాహనచోదకులకు సమస్యలెదురవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒక వ్యవహారం కలిసి వస్తుంది. అటంకాలు తొలుగుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో ఒత్తిడి అధికం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం చదువులపై దృష్టిపెడతారు. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. నిర్మాణాలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఆది, సోమవారాల్లో అనవసర జోక్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులతో సమస్యలెదురవుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఏజెన్సీలు, కాంట్రాక్టులు ఏమంత లాభదాయకం కాదు. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతన ఉండదు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనులతో సతమతమవుతారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. గృహమార్పు కలిసివస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. ఆడిటర్లకు ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాభద్ర 1, 2, 3 పాదాలు. 
వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆలోచనలు చికాకు పరుస్తాయి. మనోధైర్యంతో ముందుకుసాగండి. సలహాలు, సాయం ఆశించవద్దు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సంప్రదింపులకు అనుకూలం. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. గృహమార్పు అనివార్యం. గురువారంనాడు పనులు అర్థాంతరంగా నిలిపివేస్తారు. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. ఆధిపత్యం చెలాయించవద్దు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. రిటైర్డు ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. వృత్తుల వారికి ఆశాజనకం. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతనవుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడివుంటుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. శని, ఆదివారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు మెరుగుపడుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం సంతృప్తినిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25-04-2020 శనివారం దినఫలాలు - వేంకటేశ్వరుని ఆరాధిస్తే..