Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-04-2020 శనివారం దినఫలాలు - వేంకటేశ్వరుని ఆరాధిస్తే..

Advertiesment
25-04-2020 శనివారం దినఫలాలు - వేంకటేశ్వరుని ఆరాధిస్తే..
, శనివారం, 25 ఏప్రియల్ 2020 (05:00 IST)
మేషం : ఉద్యోగస్తులకు సహోద్యోగుల తీరు అసహనం కలిగిస్తుంది. బంగారు, వెండి, వస్త్ర, వ్యాపార రంగాల వారికి మెళకువ అవసరం. ప్రభుత్వ కార్యాలయాలలో పనులు అనుకూలిస్తాయి. సహకార సంఘాలలో వారికి, రాజకీయాలలో వారికి చికాకు తప్పదు. ఇతరులు దైవ సేవా కార్యక్రమాలలో మీ పట్ల ఆకర్షితులవుతారు. 
 
వృషభం : కొబ్బరి, పండ్లు, పూలు, నిత్యావసర వస్తు వ్యాపారులకు ఆశాజనకం. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. రచయితలకు, పత్రికా, మీడియా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. విదేశాలు వెళ్లాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతుంది. ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి ఉంటుంది. 
 
మిథునం : విద్యార్థుల్లో ఆందోళన తొలగిపోయి నిశ్చింత చోటుచేసుకుంటుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు సంభవిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
కర్కాటకం : గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. సిమెంట్, స్టాకిస్టులకు, వ్యాపారులకు మిశ్రమ ఫలితం. వైద్య, ఇంజనీరింగ్, సాంకేతిక రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. విలువైన పత్రాలు, రశీదులు ఆహ్వానాలు అందుతాయి. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యం నిరుత్సాహ పరుస్తుంది. 
 
సింహం : విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతుంది. విద్యార్థులు ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశించిన సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సదస్సుల్లో పాల్గొంటారు. 
 
కన్య : గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరం. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. సన్నిహితుల సలహాతో కొన్ని పనులు చేపట్టి పూర్తిచేస్తారు. 
 
తుల : గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. అనురాగ వాత్సల్యాలు పొందగలవు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు పోయే ఆస్కారం ఉంది. బ్యాంకింగ్ వ్యవహారంలో జాగ్రత్త అవసరం. పత్రికా రంగంలోని వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. 
 
వృశ్చికం : నూతన పరిచయాలు మీ ఉన్నతికి, పురోభివృద్ధికి తోడ్పడతాయి. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలకు ఇరుగు, పొరుగువారితో సఖ్యత అంతగా ఉండదు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. 
 
ధనస్సు : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. దూరంలో ఉన్న వ్యక్తుల గురించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. మీ పాత సమస్యలు పరిష్కరించబడతాయి. గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. 
 
మకరం : నూతన అగ్రిమెంట్లకు అనుకూలం. వృత్తి వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి శుభం చేకూరుతుంది. రావలసిన మొండిబాకీలు సైతం వసూలుకాగలవు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కీలక నిర్ణయాల విషయంలో అయినవారి సలహాలను తీసుకోండి. 
 
కుంభం : కోర్టు వ్యవహారాలలో మెలకువ వహించండి. రవాణా రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుట వల్ల ఆందోళన పెరుగుతుంది. పాత వ్యవహారాలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. క్రీడా రంగాల వారికి చికాకులు తప్పవు. 
 
మీనం : ఒక స్థాయి వ్యక్తుల కలయిక ఆశ్చర్యం కలిగిస్తుంది. వాహనచోదకులకు చికాకులు తప్పవు. అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. వైద్య రంగాలలో వారికి శుభకార్యములకై చేయు యత్నాలు ఫలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలలో వారికి కలిసివచ్చే కాలం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీవు అనుభవించవలసిన ఫలితం నీకోసం కాచుకుని వుంది