Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-04-2020 శుక్రవారం దినఫలాలు - గౌరీదేవిని ఆరాధిస్తే మనోసిద్ధి

Advertiesment
Daily Horoscope
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (05:00 IST)
మేషం : స్త్రీల పట్టుదల, మొండి వైఖరి సమస్యలకు దారితీస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులకు అనుకూలం. అనుకోకుండా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకుసాగండి. వాహనం అమర్చుకోవాలే మీ కోరిక ఫలిస్తుంది. బంధువుల నుంచి విమర్శలు తగవు. 
 
వృషభం : కొబ్బరి, పండ్లు, పూల చల్లని పానీయవ్యాపారులకు లాభదాయకం. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. రావలసిన బకాయిలు విషయంలో మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోవడం ఉత్తమం. 
 
మిథునం : ఇంట్లో వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ శ్రీమతి  మొండి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. పొగడ్తలు, విమర్శలు హుందాగా స్వీకరిస్తారు. 
 
కర్కాటకం : ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విందులు, విలాసాలలో మితంగా వ్యవహరించండి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడివల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
సింహం : గతంలో ఇచ్చిన హామీల వల్ల వర్తమానంలో ఇబ్బందులెదురవుతాయి. మీ సంతానం ఇష్టాలకు అడ్డుచెప్పడం మంచిదికాదు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. రవాణా రంగంలోని వారికి చికాకులు వంటివి ఎదుర్కొంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
కన్య : రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. సంఘంలో మీ మాటపై నమ్మకం గౌరవం పెరుగుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తారు. 
 
తుల : విదేశాలు వెళ్లాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతుంది. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి. 
 
వృశ్చికం : పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిదికాదు. 
 
ధనస్సు : ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వస్త్ర వ్యాపారులకు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఖర్చులు అధికం. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. 
 
మకరం : బాకీలు, ఇంటి అద్దెల వసూలులో దూకుడుతనంకూడదు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వల్ల అనుకోని ఇబ్బందులెదుర్కొంటారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 
 
కుంభం : మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఎల్.ఐ.సి., పోస్టల్, ఇతర ఏజెంట్లకు బ్రోకర్లకు పనిభారం అధికమవుతుంది. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. గృహంలో ప్రశాంతత లోపం, ఆరోగ్య సమస్యలు వంటి చికాకులు అధికమయ్యే అవకాశం ఉంది. 
 
మీనం : భాగస్వామిక చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ అవసరం. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్దికి నాంది పలుకుతారు. మార్కెటింగ్ రంగాల వారికి ఓర్పు, అంకితభావం చాలా అవసరమని గమనించండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏమరుపాటుతనం వల్ల ఇబ్బందులు తప్పవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన తితిదే... కారణం? (video)