Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12-04-2020 నుంచి 18-04-2020 వరకు వార రాశిఫలితాలు - video

12-04-2020 నుంచి 18-04-2020 వరకు వార రాశిఫలితాలు - video
, శనివారం, 11 ఏప్రియల్ 2020 (17:30 IST)
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. 
ఈ వారం సంప్రదింపులతో తీరిక ఉండదు. ప్రలోభాలు, ఒత్తిళ్ళకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. ఓర్పుతో వ్యవహరించండి. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. పొదుపు ధనం అందుతుంది. ఖర్చులు సంతృప్తికరం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఒక సంఘటన ఆందోళన కలిగింది. ప్రముఖులను కలుసుకుంటారు. నిర్మాణాలు, మరమ్మతులు సానుకూలమవుతాయి. ఒక సంఘటన కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. విద్యార్థులకు సమయపాలన ప్రదానం. వాహనచోదకుకు దూకుడు తగదు. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులవుతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తారు. పత్రాలు నగదు జాగ్రత్త. గృహమార్పు నిదానంగా ఫలితస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనవ్యయంతో జాగ్రత్త. ఆలోచనలు నిలకడగా ఉండవు. మీ సమర్థత మరొకరికి ఉపకరిస్తుంది. శుక్ర, శనివారాల్లో పనులు ముగింపు దశల్లో హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. దంపతుల మధ్య అమరికలు తగవు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు స్థానచలనం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రియతముల క్షేమం తెలుసుకుంటాయి 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
పెట్టుబడులకు అనుకూలం. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతగా శ్రమిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. సోమవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలువవుండదు. పనులతో సతమతమవుతారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. అవివహితులకు వివాహయోగం. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు అనూభూతినిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
బంధువులతో సంబంధాలు బలపడతాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. అవకాశాలు తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ, అధికం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు తప్పవు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. మంగళ, బుధవారాల్లో ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు ఊపందుంకుంటాయి. ఆటుపోట్లు ధీటుగా ఎదుర్కొంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. పనులు సానుకూలమవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. గురు, శుక్రవారాల్లో ఫోన్ సందేశాల పట్ల జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. శనివారం నాడు ఓర్పు, పట్టుదలతో వ్యవహరించండి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. పరిస్థితులు మెరుగుపడతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు హడావుడిగా సాగుతాయి. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయ. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. మాట నిలబెట్టుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వవద్దు. బాధ్యతగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో పురోభివృద్ధి. అనుభవం గడిస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు పనిభారం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
సంప్రదింపులకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పరిస్థితులు మెరుగుపడతాయి. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ నమ్మకం వమ్ముకాదు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు భారమనిపించవు. మంగళ, బుధవారాల్లో చెల్లింపుల్లో మెలకువ వహించండి. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. పనులు సగంలో నిలిపివేయవలసి వస్తుంది. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఉద్యోగస్తులుక శుభయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
ఆర్థిక స్థితి నిరాశాజనకం. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. రుణాలు, చేబదుళ్లు తప్పవు. పనులు మందకొడిగా సాగుతాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గురు, శుక్రవారాల్లో శ్రమ అధికం. ఫలితం శూన్యం. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు మధ్యవర్తులను విశ్వసించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఒత్తిళ్లు, ప్రలోభాలాకు లొంగవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
ప్రముఖుల సందర్శనీయం వీలుపడదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారంలో ధనంతో ముడిపడివుంటుంది. పనులు సాగక విసుగు చెందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. శని, ఆదివారాల్లో మీ గౌరవానికి భంగం కలిగే సూచనలు ఉన్నాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సంతానం చదువులపై దృష్టిపెడతారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. షాపుల స్థల మార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వృత్తులవారికి సామాన్యం. జూదాల జోలికి పోవద్దు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తారాభాద్ర, రేవతి 
పట్టుదలతో యత్నాలు సాగించండి. సలహాలు అడగవద్దు. స్వయంకృషితో రాణిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. సోమ, మంగళవారాల్లో దంపతుల మధ్య సఖ్యత లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయులకో కుదటపడారు. అవివాహితులకు శుభయోగం. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. నష్టాలను అధికమిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు స్థానంచలనం. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-04-2020 శనివారం మీ రాశిఫలాలు - పద్మనాభస్వామిని ఆరాధించినా...