బుధవారం ఆకుపచ్చ దుస్తులు.. పెసరట్టును మరిచిపోవద్దు... (video)

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (05:00 IST)
ఆదిదేవుడైన గణపతిని ఆలయాల్లో దర్శించుకోవడం మంచిది. అందుచేత బుధవారం ఉదయం, సాయంత్రం సమయాన సమీపంలోని బొజ్జగణపతి ఆలయానికి వెళ్లి.. గజనాథుడిని దర్శించుకోవడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి గరికను సమర్పించడం ద్వారా ఉన్నత ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.  
 
బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఆకుపచ్చ దుస్తులు ధరించడం ద్వారా చేపట్టిన కార్యాలు విజయవంతమవడంతో పాటు, శుభ ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా... స్త్రీలు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు పువ్వులు అంటే సంపంగి వంటివి తలలో ధరించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుంది.
 
అలాగే బుధవారం రోజున పెసల పప్పుతో చేసిన వంటలు అంటే పెసరట్లు, పెసరపప్పు పచ్చడి, పెసలతో చేసిన హల్వా, లడ్డు వంటి పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా చింత, సీమచింత పండ్లు స్వీకరించడం కూడా శ్రేయస్కరమని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maoist Leader: వాంటెడ్ తీవ్రవాదులలో ఒకరైన పక్క హనుమంతు హతం

శ్రీశైలం టోల్ గేట్ వద్ద తనిఖీలు.. భారీ స్థాయిలో లిక్కర్ స్వాధీనం

Women Lover: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.. గుండెపోటు వచ్చిందని డ్రామా

కాలుజారి కిందపడింది.. అంతే.. 17ఏళ్ల బోనాల డ్యాన్సర్ మృతి

Army: సైనికులకు గుడ్ న్యూస్.. ఇక రీల్స్ చూడవచ్చు.. కానీ అది చేయకూడదు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి.. కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం

01-01-2026 నుంచి 31-01-2026 వరకు మాస ఫలితాలు - ఏ రాశులకు లాభం

2026-2027- శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- తులారాశికి ఈ సంవత్సరం అంతా ఫలప్రదం

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- కన్యా రాశికి ఆదాయం- 8, వ్యయం-11

TTD: స్వీడన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, శ్రీలంకలో శ్రీవారి ఆలయాలు

తర్వాతి కథనం
Show comments