Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

సెల్వి
గురువారం, 14 నవంబరు 2024 (09:42 IST)
కార్తికమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుద్ద చతుర్దశి తిథినే వైకుంఠ చతుర్దశి అంటాం. ఈ రోజున విష్ణుమూర్తితో పాటూ శివుడిని కూడా తప్పకుండా పూజించాలి. అలా పూజిస్తే మోక్షం పొందవచ్చు. చతుర్దశి తిథి నాడు విష్ణుమూర్తిని పూజిస్తారు. అయితే ప్రత్యేకించి ఈ వైకుంఠ చతుర్దశి తిథిని శివకేశవులకు ఇద్దరికీ సంబంధించిన తిథిగా చెప్పవచ్చు. 
 
సహస్ర కమలాలతో శ్రీ మహావిష్ణువును సహస్రనామాలతో అర్చించి చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అంతేకాదు ఎవరైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసీ కళ్యాణం జరుపుకోలేకపోయారో వారు ఈ రోజున విశేషించి సాయంత్రం చతుర్దశి తిథి ఉన్న సమయంలో తులసీ వివాహం చేసుకోవచ్చు.
 
వైకుంఠ చతుర్దశి రోజు విష్ణువు ఆలయం లేదా శివాలయంలో దీపదానం చేయడం విశేషంగా చెప్పవచ్చు. అందులోనూ రాగి లేదా, ఇత్తడి లోహాలతో తయారు చేసిన కుందుల్లో దీపాలను వెలిగించి, వాటిని బ్రాహ్మణుడికి దక్షిణా పూర్వకంగా, మంత్రపూర్వకంగా దీపదానం చేస్తే మరుజన్మ ఉండదని పురాణ వచనం. ఈ విధంగా చేయడం వల్ల పూర్వజన్మలో, ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలిగిపోయి సమస్త శుభాలూ చేకూరుతాయని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దమ్ముంటే నన్నుఅరెస్ట్ చేయాలి.. వైకాపా చీఫ్ జగన్ సవాల్

దుబాయ్ వీధుల్లో టర్కిష్ ఐస్ క్రీమ్‌ను రుచి చూసిన అనంత్ రాధిక (Video)

కేటీఆర్- సమంత కేసు.. సాక్షుల వాంగ్మూలం రికార్డ్.. తర్వాత ఎవరు?

పోలీసు నోటీసులు అందుకున్న రాంగోపాల్ వర్మ.. త్వరలోనే అరెస్టా?

బెంగళూరులో 42 కేసులు నమోదు.. 64మంది అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

క్షీరాబ్ధి ద్వాదశి- తులసీ కోట వద్ద నేతి దీపం.. నువ్వుల నూనె వాడితే?

క్షీరాభ్ధి ద్వాదశి విశిష్టత.. తులసీ కళ్యాణం ఎందుకు?

సింహాచలంపై శంఖు చక్ర నామాలు.. కొండకు హైలెట్‌

12-11-2024 మంగళవారం ఫలితాలు - మీ వాక్కు ఫలిస్తుంది.. మాట నిలబెట్టుకుంటారు...

కార్తిక శుద్ధ ఏకాదశి రోజున పూజ.. అన్నదానంతో కోటి ఫలం

తర్వాతి కథనం
Show comments