Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్షీరాబ్ధి ద్వాదశి.. సాయంత్రం పూట తులసీకోట ముందు దీపం తప్పనిసరి

tulasi kota

సెల్వి

, బుధవారం, 13 నవంబరు 2024 (11:41 IST)
అన్ని మాసాలలో కెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీకమాసం. కార్తీక మాసం మొదటి రోజు నుంచి మకర సంక్రాంతి వరకు దీక్షలు చేస్తారు. శివాలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహిస్తూ తమ దోషాలు, బాధలు తొలగిపోవాలని కోరుకుంటూ శివుడికి మొరపెట్టుకుంటారు.
 
కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టుకు పూజ చేస్తారు. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నివాసంగా పేర్కొంటారు. అందుకే ఉసిరి చెట్ల కింద భోజనం చేయడం చేస్తారు. వీటినే వన భోజనాలు అంటారు. అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తారు.
 
కార్తీకమాసంలో తులసిపూజ చేసేవారు ఉత్తమలోకాలను పొందుతారు. కార్తీకంలో తులసీదళం కలసిన నీటిలో స్నానం ఆచరించేవారి పాపాలు పటాపంచలు అవుతాయి. తులసి ఉన్నచోట అకాల మృత్యులు దరిచేరదు.
 
ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్రపుణ్య నదీ స్నానం ఆచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత, విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతి నిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్య ఫలం లభిస్తుంది.
 
ఈ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు అంటే, పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మధనం చేసిన రోజు. కనుక దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అను పేరు వచ్చింది. పాల సముద్రాన్ని చిలికారు కనుక చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. క్షీరాబ్ధి ద్వాదశి రోజు సాయంత్రం ముందు తులసీ కోట దీపదానం చేయడం ప్రధానం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబర్ 17న తిరుమలలో కార్తీక వనభోజనం