Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో వేడుకలు జనవరి 1 నుంచి 11 వరకు..

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (18:15 IST)
వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సదుపాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. వైకుంఠ ఏకాదశి పుణ్యకాలం దగ్గరలోనే ఉంది. వైకుంఠ ఏకాదశి వేడుకలు పది రోజుల పాటు జరుగనున్నాయి. ఇందులో భాగంగా 2 జనవరి 2023 నుండి 11 జనవరి 2023 వరకు నిర్వహించబడుతుంది.
 
దాదాపు రూ.300 ధర ఉండే ప్రత్యేక దర్శనం టిక్కెట్లు డిసెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచబడ్డాయి. ఈ టిక్కెట్‌లు, ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత జనవరి 1 నుండి 11 వరకు వర్తిస్తాయి.  
 
తిరుమల వైకుంఠం శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని ప్రతిరోజు దాదాపు 50 వేల మంది సందర్శిస్తుంటారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి టిక్కెట్ కొనుగోలు కోసం ఆన్‌లైన్ డిజిటల్ సేవలను అమలు చేసింది. 
 
డిసెంబర్ 23, 2022, తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో వార్షిక అధ్యాయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సుదీర్ఘ వార్షిక కార్యక్రమం వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు ప్రారంభమై జనవరి 15న ముగుస్తుంది.
 
ఈ సందర్భంగా 12 మంది ఆళ్వార్లు రచించిన నాలాయిర దివ్యప్రబంధ పాశురములు అని పిలువబడే మొత్తం 4000 కీర్తనలు ప్రతిరోజూ పఠించబడతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

జూన్ 4న కౌంటింగ్-గేమ్ ఛేంజర్‌గా మారనున్న పోస్టల్ బ్యాలెట్లు..

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

ప్రపంచ జీవన కాలం.. పదేళ్ల పురోగతిని తిప్పికొట్టిన కోవిడ్ మహమ్మారి

మే 22 నుంచి 24 వరకు తిరుచానూరు వార్షిక వసంతోత్సవం

22-05-2024 బుధవారం దినఫలాలు - కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి...

బుద్ధ పౌర్ణమి.. వైశాఖ పౌర్ణమి పూజ.. దానాలు.. ఇవి కొంటే?

నరసింహ జయంతి : పంచామృతంతో అభిషేకం.. పానకం, నేతి దీపం..

21-05-202 మంగళవారం దినఫలాలు - పెంపుడు జంతువుల పట్ల మెళకువ అవసరం...

తర్వాతి కథనం
Show comments