Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండుగ సీజన్‌కు వరంగల్‌లో అమెజాన్ సేమ్-డే డెలివరీ సదుపాయం

Amazon
, సోమవారం, 26 సెప్టెంబరు 2022 (23:01 IST)
అమెజాన్ ఇండియా నేడు భారతదేశ వ్యాప్తంగా 50కు పైగా నగరాలు, పట్టణాల్లో కొన్ని గంటల్లోనే ప్రైమ్ సభ్యులకు తన సేమ్‌-డే డెలివరీని విస్తరించగా, 4 గంటల లోపే వినియోగదారులు ఆర్డర్ చేసిన వాటిని పంపిణీ చేస్తామని ప్రకటించింది. వైర్‌లెస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, పుస్తకాలు, బొమ్మలు, బేబీ ప్రొడక్ట్స్, మీడియా, కిచెన్, లగ్జరీ, క్రీడలు, వీడియో గేమ్స, పర్సనల్ కేర్ తదితర విభాగాల్లో అమెజాన్ వస్తువులను వితరణ చేయనుంది. కొన్ని గంటల్లో సేమ్‌-డే డెలివరి గత ఏడాదితో పోల్చితే 2.5 రెట్లు ఎక్కువ పిన్‌కోడ్‌లలో అందుబాటులో ఉండగా, 14 నగరాల నుంచి ఈ ఏడాది 50 నగరాలు మరియు పట్టణాలకు విస్తరించగా, అందులో తెలంగాణలోని సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్‌లతో సహా.
 
అమెజాన్ మొదటిగా భారతదేశంలో 2017లో సేమ్-డే డెలివరీని పరిచయం చేసింది. ఒన్-డే, సేమ్-డే నెట్‌వర్కుల విస్తరణతో అమెజాన్ తన వినియోగదారులకు వేగంగా, విశ్వసనీయతతో అనుకూలకరంగా పంపిణీ ఎంపికలను చేసేందుకు తన పెట్టుబడులను కొనసాగించిం. వేగవంతమైన డెలివరీని సాధ్యం చేసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వ్యూహాత్మంగా ఈ ఆర్డర్లను పంపిణీ చేసేందుకు ప్రత్యేక భవంతులను కలిగి ఉంది. ఈ ప్రత్యేక భవంతులను వేగవంతమైన క్లిక్-టు-డెలివరీ వేగానికి అనుగుణంగా ఉన్నతీకరించారు. ఇవి వినియోగదారుల నివాసాలకు చేరువగా ఉంటాయి. ఈ కొత్త సౌలభ్యాలు వారు సేవలు అందితంచే నగరాల హృదయభాగంలో ఉండగా, అవి వినియోగదారుని వద్దకు చేరేందుకు ప్యాకేజ్ ఎక్కువ దూరం ప్రయాణించవలసిన అవసరం లేకుండా చేస్తాయి.
 
‘‘మేము మా వినియోగదారులకు అత్యుత్తమమైన వారిగా ఉండేందుకు ఎల్లప్పుడూ నూతన స్థాయి అనుకూలత, డెలివరీ ఎంపికలను అందించేలా ఆవిష్కరణలను చేస్తున్నాము; వినియోగదారులకు ఎక్కువ ఎంపికలు, వేగం, అనుకూలతలను కల్పించే కొన్నే గంటల్లో డెలివరీ చేయగలిగిన సేమ్-డే డెలివరీ దానికి సరికొత్త ఉదాహరణ. వినియోగదారులకు కావలసిన ఉత్పత్తులను వేగంగా డెలివరీ చేసే ఉద్దేశంతో తక్కువ సేవలు అందుకుంటున్న మెట్రోల వెలుపల నగరాలు మరియు పట్టణాల్లో పరిచయం చేసేందుకు ఉత్సుకతతో ఉన్నాము. దానికి వినియోగదారుల నివాసాలకు సమీపంలో ఉన్న ప్రత్యేక భవంతుల్లో అవసరమైన వస్తువులను సేకరించి అలాగే మా డెలివరీ నెట్‌వర్కు వినియోగదారులకు మరియు ప్రైమ్ సభ్యులకు చేరువగా ఉండేలా చేయడంతో ఇది సాధ్యమైంది. సేమ్-డే డెలివరీ అసోసియేట్లకు, ముఖ్యంగా నగరంలోపల ఉండే ప్రాంతాలకు మహోన్నత ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాము’’ అని అమెజాన్ ఇండియా కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్, సప్లై చైన్ అండ్ అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ డైరెక్టర్ అభినవ్ సింగ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నతల్లిని చిత్ర హింసలకు గురిచేసిన కన్నకొడుకు..