Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

Advertiesment
amazon great indian festival
, మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (17:03 IST)
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ సేల్ ప్రారంభానికి ముందే అమెజాన్ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. ఆగస్టు 28వ తేదీ నుంచి అక్టోబరు 26వ తేదీ మధ్యలో తమ ఫ్లాట్‌ఫామ్‌పై నమోదవుతున్న కొత్త సెల్లర్లకు అన్ని కేటగిరీలపై సెల్లింగ్ ఫీజును 50 శాతం మేరకు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
అయితే, తమ ఫ్లాట్‌ఫాంపై రిజిస్టర్ అయిన 90 రోజుల్లో వీరు తమ వస్తువులను అమెజాన్ ఫ్లాట్‌ఫాంపై లాంచ్ చేయాల్సి వుంటుంది. అమెజాన్ ఇండియాపై తమ ప్రాజెక్టులను విక్రయిస్తున్నందుకు అమ్మకందారులు చెల్లించే ఫీజులో ఇది ఒకటి. కొనుగోలుదారుడు చెల్లించే అమ్మకపు ధరపై ఒక శాతం ఈ ఫీజులను అమెజాన్ వసూలు చేస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీజును సగం మేరకు మాఫీ చేసింది. 
 
మరోవైపు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ ఈ నెల 23వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ సేల్ సందర్భంగా స్టేట్ బ్యాంకు కార్డు హోల్డర్లు ఇన్‌స్టాంట్‌గా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంతేకాక కస్టమర్లకు తమ తొలి కొనుగోలుపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ ఆఫర్ చేయబోతుంది. 
 
ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ 2022ను శాంసంగ్ గెలాక్సీ ఎం, ఐక్యూ కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయి. దీంతో ఈ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును అమెజాన్ అందించనుంది. స్మార్ట్‌ఫోన్లపై సుమారు 40 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్సవ్ డిపాజిట్: ఎస్బీఐ నుంచి కొత్త డిపాజిట్ పథకం..