గాజువాక విద్యార్థిని బంపర్ ఆఫర్.. వార్షిక వేతనం రూ.44.4 లక్షలు
						
		
			      
	  
	
			
			  
	  
      
								
			
				    		 , బుధవారం,  31 ఆగస్టు 2022 (11:54 IST)
	    	       
      
      
		
										
								
																	విశాఖపట్టణం గాజువాక శ్రీనగర్ కాలనీకి చెందిన విద్యార్థినికి బంపర్ ఆఫర్ వరించింది. వార్షికవేతనం రూ.44.4 లక్షలతో అమెజాన్ సంస్థ ఉద్యోగాని ఆఫర్ చేసింది. విశాఖలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, వైజాగ్ క్యాంపస్‌కు చెందిన సీఎస్ఈ విద్యార్థిని కొమ్మిరాజు జాహ్నవికి అమెజాన్ ఇండియా సంస్థ ఈ ఆఫర్ చేసింది. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
		 
		ఈ నెల 20వ తేదీన నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 26 మందిని ఎంపిక చేసుకోగా, జాహ్వవికి అత్యధిక వేతనం లభించింది. మరో 25మ మందికి రూ.17.77 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేస్తూ తాజాగా ఫలితాలను ప్రకటించిందని గీతం కరెరీ గైడెన్స్ సెంటర్ కాంపిటెన్సీ డైరెక్టర్ డాక్టర్ రోజీనా మ్యాథ్యూస్ వెల్లడించారు. 
		 
		గాజువాక శ్రీనగర్‌కు చెందిన జాహ్నవి తండ్రి వెంకటసుధాకర్ జనరల్ స్టోర్ నడుపుతుంటారు. తల్లి ఉష గృహిణి. భారీ జీతంతో అమెజాన్ ఆఫర్ లభించడంపై జాహ్నవి మాట్లాడుతూ గీతంలో ప్రథమ సంవత్సరం నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూలను ఎదుర్కోవడంపై ఇచ్చిన శిక్షణ ఎంతో ఉపకరించిందని తెలిపింది. 
 
	    
  
	
 
	
				       
      	  
	  		
		
			
			  తర్వాతి కథనం
			  