Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ వాకిలి పసుపు పచ్చగా వుంటే ఎంత లాభమో తెలుసా?

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (14:51 IST)
ఆధ్యాత్మిక పరంగా మీ వాకిలి లేదా వ్యాపారం జరిగే వాకిలి పసుపు పచ్చగా వుంటే.. ధనాదాయం వుంటుంది. ఇంకా ఆవుపేడను పసుపును కలుపుకుని వాకిలిని అలికితే.. సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి. వ్యాపారం జరుగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది. అలాగే వ్యాపారాలు జరిగే చోట పసుపు నీటిని చల్లటం ద్వారా ఆర్థిక సమస్యలు వుండవు. 
 
ఇంకా దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది. అంతేగాకుండా..  పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది. ముఖ్యంగా దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.
 
పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే కన్యలకు వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

27-05-2025 దినఫలాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

26-05-2025 సోమవారం దినఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

TTD Temple: హైదరాబాద్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

25-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిడికి గురికావద్దు.. స్థిమితంగా ఉండండి...

25-05-2025 నుంచి 31-05-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments