Webdunia - Bharat's app for daily news and videos

Install App

04-03-2020 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించినా...

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (05:00 IST)
మేషం : ప్రైవేటు సంస్థలలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ముఖ్య విషయాల్లో కుటుంబీకుల మధ్య ఏకీభావం కుదరదు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించడం మంచిది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
 
వృషభం : బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. దంపతుల మధ్య ఏకీభావం కుదరదు. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
మిథునం : మొహమ్మాటాలు, ఒత్తిళ్ళ వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. పోస్టల్, కొరియర్ రంగాలవారికి శ్రమాధిక్యత తప్పదు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. 
 
కర్కాటకం : ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. బ్యాంకు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో సఫలీకృతులవుతారు. ముఖ్యుల రాక మీకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. 
 
సింహం : ముఖ్యమైన పనులు వాయిదాపడతాయి. గృహ నిర్మాణాల్లో అడ్డంకులు తొలగిపోగలవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం అధికమవుతుంది. నూతన పరిచాయాలేర్పడతాయి. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో బాగా రాణిస్తారు. 
 
కన్య : విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం సంతృప్తినిస్తుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు ఆశాజనకం. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. అధికారులు ధనప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
తుల : కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కార మార్గంలో పయనిస్తాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించండ మంచిది. రావలసిన ధన సమయానికి అందక ఇబ్బందు లెదుర్కొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. 
 
వృశ్చికం : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తచేసి అధికారులను ప్రసన్న చేసుకోగలుగుతారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తికాగలవు. 
 
ధనస్సు : ఆర్థిక ఇబ్బందులు లేకున్నా ఏదో సాధించలేకపోయామన్న అసంతృప్తి వెన్నాడుతుంది. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పవు. పాత రుణాలు చెల్లిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బ్యాంకు పనుల్లో మెలకువ వహించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. 
 
మకరం : మీ ఆశక్తతను కుటుంబీకుల అర్థం చేసుకుంటారు. వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమార్గం గోచరిస్తుంది. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. కొన్ని సందర్భాల్లో మీ సమర్థతపై నమ్మకం ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 
 
కుంభం : వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంతో పాటు అనుభవం గడిస్తారు. ప్రముఖుల పరిచయాలు మీ పురోభివృద్ధికి దోహదం చేస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీ, బాధ్యతల మార్పులు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిదేనని భావించకండి. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
మీనం : భాగస్వామిక సమావేశాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. ప్రేమికుల తీరు పెద్దలకు సమస్యగా మారుతుంది. మీ కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వడం మంచిది కాదు. ప్రథమార్థంలో సమస్యలు, చికాకులు ఎదుర్కొన్నా ద్వితీయార్థం అనుకూలతలు అధికంగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజీ కుదిరితే కేసు కొట్టేస్తారా.. టీచర్‌ను ప్రాసిక్యూట్ చేయండి.. సుప్రీంకోర్టు

సొంత చెల్లిని తిడితే జగన్‌కు పౌరుషం రాలేదా? హోంమంత్రి అనిత

దేశంలో అత్యధిక విరాళాలు ఇచ్చిన శివ్ నాడార్..

2025 జనవరి 20న మధ్యాహ్నం డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం

మాట్లాడేందుకు మైక్ ఇస్తామంటేనే అసెంబ్లీకి వెళతాం : వైఎస్ జగన్

అన్నీ చూడండి

లేటెస్ట్

నాగుల చవితి: పుట్టలో పాలు, పూజ ఎలా చేయాలి.. ఈ శ్లోకం.. ఈ మంత్రం చదివితే?

05-11-2024 మంగళవారం ఫలితాలు : కార్యసాధనలో సఫలీకృతులవుతారు...

మీ దగ్గర తీసుకున్న డబ్బు ఎవరైనా ఇవ్వకపోతే..?

విశాఖ నక్షత్రంలోకి సూర్యుని పరివర్తనం.. 3 రాశులకు అదృష్టం

కార్తీకమాసంలో ఛట్ పూజ.. సూర్యునికి ఇలా అర్ఘ్యమిస్తే.. రాగి నాణేలను..?

తర్వాతి కథనం
Show comments