Sravana Saturday: శ్రావణ శనివారం- ఈ పనులు చేస్తే శని గ్రహ దోషాలు మటాష్

సెల్వి
శనివారం, 26 జులై 2025 (08:04 IST)
Lord shiva
శ్రావణ శనివారం శివలింగానికి నువ్వులను సమర్పించడం ద్వారా శని గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే శనికి ప్రీతికరమైన జమ్మి ఆకులు శివునికి సమర్పించడం వల్ల శివుని అనుగ్రహంతో శనీశ్వరుడు ప్రసన్నుడవుతాడు. నీలం రంగు పువ్వులు అంటే శంఖు పుష్పాలు, జిల్లేడు పువ్వులు శనీశ్వరుడికి చిహ్నంగా భావిస్తారు. ఇవి శివుడికి కూడా ప్రియమైనవి. 
 
శ్రావణ శనివారం శివుని నీలిరంగు పువ్వులతో పూజిస్తే శివుడు ప్రీతి చెంది ఏలినాటి శని, అర్దాష్టమ శనితో సహా అనేక దుష్టగ్రహ ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శనిదేవుని ప్రీతికరమైన బెల్లం శ్రావణ శనివారం రోజు శివునికి నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలో అభివృద్ధి శ్రేయస్సు తప్పకుండా ఉంటాయని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 
 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని భగవానుని న్యాయ దేవత అంటారు. జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దోషాలుంటే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు వంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. 
 
ఇలాంటి వారు శ్రావణ శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం.. విష్ణుపూజ, శివపూజ చేయడం మంచిది. ఈ రోజు చేసే శివారాధన ఎన్నో గ్రహ దోషాలను పోగొడతాయని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

అన్నీ చూడండి

లేటెస్ట్

Diwali 2025: దీపావళి ఐదు రోజుల వెలుగుల పండుగ.. ఎలా జరుపుకోవాలి?

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

Kalashtami 2025: కాలాష్టమి రోజున వస్త్రదానం లేదా డబ్బుదానం చేస్తే..?

13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments