Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేప నూనెతో దీపాలను వెలిగిస్తే.. లాభాలేంటో తెలుసా? (video)

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (15:11 IST)
దీపారాధనతో అజ్ఞానాన్ని పారద్రోలవచ్చు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. సంపద, ఆరోగ్యం ప్రాప్తించాలంటే దీపారాధన చేయాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. పాపాలను తొలగించుకోవడం కోసం పుణ్యఫలాలను పొందాలంటే దీపారాధన చేయాలి. అయితే దీపారాధనకు ఏ నూనెను ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. 
 
దీపారాధనకు నెయ్యిని ఉపయోగించడం శ్రేష్టమైన ఫలితాలను ఇస్తుంది. ఇంట్లో నేతితో దీపం వెలిగించడం ద్వారా సానుకూల ఫలితాలు వుంటాయి. నేతితో దీపాలను వెలిగించడం ద్వారా ఆ ఇంట దారిద్ర్యం తొలగిపోతుంది. ఆరోగ్యం, సంపద చేకూరుతుంది. ఇంకా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఈతిబాధలు తొలగిపోతాయి.
 
నువ్వుల నూనె.. 
నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే.. నవగ్రహ దోషాలుండవు. దుష్ట శక్తుల ప్రభావం అస్సలు వుండదు. పుర్వ జన్మల కర్మ ఫలితాలతో కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. శనీశ్వర గ్రహ ప్రభావంతో ఏర్పడే ఇబ్బందులను తొలగించుకోవాలంటే.. శనివారం పూట నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ముఖ్యం శనిగ్రహ దోషాలను ఈ నూనె దూరం చేస్తుంది.
 
వేపనూనె
వేప నూనెతో దీపాలను వెలిగిస్తే.. పార్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది. కులదేవతా పూజకు తప్పకుండా వేపనూనెను వాడాలట. అలా వాడితే సంపద, ఆయుర్దాయం చేకూరుతుంది. శత్రుబాధలు వుండవు. ఇంకా కాలభైరవునికి వేపనూనెతో పౌర్ణమి రోజు, కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి రోజు 8 ప్రమిదలతో దీపమెలిగిస్తే.. ఈతిబాధలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కర్మ ఫలితాలు వుండవు. 
 
ఆముదంతో దీపాలు వెలిగిస్తే.. సుఖసంతోషాలతో కూడిన జీవనం చేకూరుతుంది. వ్యాపారాభివృద్ధి, కీర్తి లభిస్తుంది. అలాగే విఘ్నేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. కొబ్బరినూనెతో దీపమెలిగించాలి. అలాగే వినాయకుడికి కొబ్బరినూనెతో దీపమెలిగించే వారి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. 
 
పంచ దీప నూనె.. 
పంచ దీప నూనెతో శివానుగ్రహం లభిస్తుంది. ఈ నూనెతో శివలింగం ముందు దీపమెలిగిస్తే.. ఆరోగ్యం, ఆయుర్దాయం చేకూరుతుంది. ప్రతికూల ఫలితాలుండవు. పంచ దీప నూనెతో దీపమెలిగించే ఇంట సానుకూల ఫలితాలే వుంటాయి. అప్పుల బాధ వుండదు. 
 
కాలభైరవునికి పంచ దీప నూనెతో పౌర్ణమి రోజుల్లో వెలిగిస్తే.. ఆర్థిక ఇబ్బందులుండవని.. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలనుకునే వారు పంచ దీప నూనెతో కృష్ణ పక్ష అష్టమి రోజున కాలభైరవునికి దీపమెలిగించి.. పరమేశ్వరునికి విభూతితో అభిషేకం చేయించాలని పండితులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

లేటెస్ట్

మంగళవారం హనుమంతునికి జాస్మిన్ ఆయిల్‌తో దీపం వెలిగిస్తే?

11-02-2025 మంగళవారం రాశిఫలాలు - త్వరలోనే రుణవిముక్తులవుతారు...

Dhanvantari : ఆరోగ్యప్రదాత.. ధన్వంతరి జీవ సమాధి ఎక్కడుందో తెలుసా..?

ఫిబ్రవరి 12న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ.. భక్తుల రద్దీ

ప్రదోష కాలంలో తులసి, కొబ్బరి నీళ్లు శివునికి ఇవ్వకూడదట!

తర్వాతి కథనం
Show comments