Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వామ్మో.. అతివేగంగా వెళ్తున్న లారీకి ముందు ఆవు వచ్చి నిలబడింది.. (వీడియో)

వామ్మో.. అతివేగంగా వెళ్తున్న లారీకి ముందు ఆవు వచ్చి నిలబడింది.. (వీడియో)
, శనివారం, 2 ఫిబ్రవరి 2019 (11:02 IST)
అతివేగంతో వెళ్తున్న లారీ ముందు ఓ ఆవు నిలబడింది. అయితే ఆ లారీ డ్రైవర్ సమయోజితంగా బండిని ఆపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లారీ అతివేగంతో వచ్చిన ఓ లారీ ఆవును చూసిన వెంటనే ఒక్కసారిగా ఓ రౌండ్ కొట్టి ఆగింది. నగరంలో ఆవులు, శునకాలు రోడ్డుపైకి వస్తుంటాయి. 
 
ఇలా రోడ్డుపైకి వచ్చిన ఆవు వేగంగా వచ్చిన లారీని చూసి జడుసుకుని పక్కకు వెళ్లిపోయింది. అయితే ట్యాంకర్ లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఆ లారీ ఒక్క రౌండ్ వేసి మరీ ఆగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో డ్రైవర్‌ సమయోచితంగా ప్రమాదం నుంచి గట్టెక్కించాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్‌లో సినీ ఫక్కీలో లైవ్ ‌ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు...