Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయిని లాంగ్ డ్రైవ్ తీస్కెళ్లి పొదల్లోకి లాక్కెళ్లి రేప్ యత్నం... అవి కుట్టడంతో పరార్...

Advertiesment
అమ్మాయిని లాంగ్ డ్రైవ్ తీస్కెళ్లి పొదల్లోకి లాక్కెళ్లి రేప్ యత్నం... అవి కుట్టడంతో పరార్...
, మంగళవారం, 29 జనవరి 2019 (19:06 IST)
డేటింగుల పేరుతో అమ్మాయిలు అబ్బాయిలు చెట్టాపట్టాలేసుకొని తిరగడం చూస్తూనే ఉన్నప్పటికీ, కొంతమంది మరో మెట్టుపైకి వెళ్లి అత్యాచారాలకు కూడా పాల్పడుతూ ఉండటం అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇండోనేషియాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. 16 ఏళ్ల ఓ టీనేజ్ అమ్మాయి డేటింగ్ మాయలో పడి 29 ఏళ్ల టోని ఐర్వాన్‌తో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింది. 
 
ఇద్దరూ సరదాగా ఎంజాయ్ చేస్తూండగా టోనీ ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించి తనతో శృంగారం చేయవలసిందిగా బలవంతం పెట్టాడు. అయితే అందుకు ఆమె అంగీకరించకుండా మార్గమధ్యంలోని ఓ గ్రామంలో అతడి నుండి తప్పించుకోవడానికి విఫలయత్నం చేసింది. ఆమెని పట్టుకొచ్చి మళ్లీ కారెక్కించిన టోనీ మరి కొంతదూరం వెళ్లాక, ఒక నిర్మానుష్య ప్రాంతంలోని పొదల్లోకి ఆ అమ్మాయిని లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు.
 
చెట్లు చేమల మధ్య ఉన్న చీమల దండు ఒక్కసారిగా టోనిపై దాడికి దిగాయి. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో చీమలు అతడ్ని కుట్టడంతో బెంబేలెత్తిపోయాడు. ఇదే అదునుగా భావించిన ఆ యువతి టోనీ బారి నుంచి తప్పించుకుని రక్షించాలని కేకలు పెడుతూ... పరుగులు తీసింది.
 
ఈ వ్యవహారం మొత్తం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టోనీ ఐర్వాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పలు కేసులు నమోదు చేసారు. టోనీ చేసిన నేరానికిగాను అతనికి మూడు నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతి పందేల్లో కోట్ల ఫేక్ నోట్లు... తేలు కుట్టిన దొంగల్లా పందెంరాయుళ్లు...