మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ఒకవేళ ఎవరినైనా మీరు ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని ఎలా తెలుసుకోవడం అనుకుంటున్నారా..? అయితే ఈ కథనం చదవాల్సిందే.
ప్రేమలో పడినట్లు తెలుసుకోవాలంటే.. మీకు ఉత్కంఠ, ఆందోళన వల్ల గుండెలో బరువుగా అనిపించినా, లేదా శరీరమంతా ఆనందానుభూతి కలిగినా మీరు ప్రేమలో పడ్డట్టేనని తాజా అధ్యయనంలో తేలింది.
ఫిన్లాండ్, స్వీడన్, తైవాన్‌కు చెందిన 700 మంది వ్యక్తులపై ఫిన్లాండ్‌లోని ఆల్టో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
మానసిక ఉద్వేగాలు శరీరాన్ని ఎలాంటి అనుభూతులకు గురిచేస్తాయన్న అంశంపై వీరు పరిశోధన చేశారు. కంప్యూటర్‌లో మానవ దేహాల చిత్రాలను చూపించి వారిలో ఉద్వేగాలను కలిగించారు. వీరిపై చిత్రాలను చూసినప్పుడు ప్రాథమిక ఉద్వేగాలన్నీ ఎక్కువగా గుండె కొట్టుకునే వేగం, శ్వాసపీల్చుకోవడంపైనే ఎక్కువగా ప్రభావం చూపినట్టు వీరి అధ్యయనంలో తేలింది.
ఈ పరిశోధనలో ప్రేమ భావనలు మనలో సంతోషాన్నిస్తాయని పరిశోధకులు గుర్తించారు. దాదాపుగా అన్ని రకాల ఉద్వేగాల వల్ల ముఖ కండరాల్లో చైతన్యం, చర్మ ఉష్ణోగ్రతల్లో మార్పులు కూడా కలుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.