Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి ఆకుల తోరణాన్ని ఆ రోజుల్లో ఇంటి గుమ్మం ముందు కడితే..?

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (17:58 IST)
మంగళవారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకుల తోరణాన్ని కడితే.. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవని.. ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.


అలాగే కస్తూరి పసుపు, పచ్చ కర్పూరంను నీటిలో కలిపి, మంగళవారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇంటిలోపల, వెలుపల చల్లడం ద్వారా సానుకూల ఫలితాలు వుంటాయి. అలాగా నిమ్మ, గుమ్మడికాయతో ఇంటికి దృష్టి తీయడం చేస్తే.. ఇంట్లో దుశక్తులు ఇంటి నుంచి దూరమవుతాయి. ఇంకా శుభవార్తలు వింటారు.
 
ఇకపోతే.. ఆలయానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. పుష్పాలైనా వెంటబెట్టుకుని వెళ్లాలి. వట్టి చేతులతో ఆలయంలోకి ప్రవేశించడం కూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలు, కుంకుమ, విభూతి, పసుపును అక్కడే విడిచిపెట్టి రావడం చేయకూడదు. ఇంటికి తెచ్చుకుని.. కుటుంబ సభ్యులకు ఇవ్వడం చేయాలి. 
 
అదేవిధంగా ఆలయాల్లో నేతి లేదా నువ్వుల నూనెతో దీపమెలిగించాలనుకునేవారు.. అగ్గిపెట్టెను వెంటపెట్టుకుని వెళ్లాలి. ఇతరులు వెలిగించిన దీపంతో నేతి దీపాన్ని, నువ్వుల నూనెతో దీపాన్ని లేదా కర్పూరాన్ని కూడా వెలిగించకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
ఆలయాల్లో గర్భగుడికి నేరుగా నిలబడి దైవదర్శనం చేయకూడదు. నందికి అడ్డంగా నిల్చుని శివ దర్శనం చేయకూడదు. గర్భగుడికి కుడి వైపు లేదా ఎడమ వైపు నిల్చుని స్వామిని దర్శించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments