Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుక్రవారం లక్ష్మీదేవిని తెలుపు రంగు పువ్వులతో పూజిస్తే..? (video)

శుక్రవారం లక్ష్మీదేవిని తెలుపు రంగు పువ్వులతో పూజిస్తే..? (video)
, గురువారం, 13 డిశెంబరు 2018 (17:27 IST)
వారాల్లో ఏడు రోజులున్నా.. శుక్రవారానికి ప్రత్యేకత వుంది. శుక్రవారాన్ని లక్ష్మీవారం అంటారు. ఆ రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సిరిసింపదలు వెల్లివిరుస్తాయి. శుక్రవారాల్లో మహిళలు దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం లక్ష్మీదేవిని ప్రార్థించడం చేస్తుంటారు. అలాగే శుక్రవారం పూజ ఆయురారోగ్యాలు, సిరిసంపదలను ప్రసాదిస్తుంది. సౌభాగ్యాన్నిస్తుంది. ఈతిబాధలుండవు. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. శుక్రవారం ఉదయం పూట లక్ష్మీదేవిని పూజించడం ఉత్తమం. 
 
ఇంకా శుక్రవారం చేయాల్సిన పూజా విధానాల గురించి తెలుసుకుందాం.. ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. శుభ్రమైన దుస్తులను ధరించాలి. తెలుపు రంగు దుస్తులు ధరించడం చేయాలి. తెలుపు రంగు పువ్వులను పూజకు ఉపయోగించడం ఇంకా మంచిది. ఇంటిల్లిపాదిని శుభ్రం చేసుకుని.. రంగవల్లికలు వేయాలి. పూజగదిని శుభ్రం చేసుకుని.. పటాలకు, ప్రతిమలను పసుపుకుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి. వీలైతే కలశపూజ చేయవచ్చు. ముందుగా గణపతి పూజించడం మరిచిపోకూడదు. 
 
అరటి ఆకుపై బియ్యాన్ని పరచి రాగి చెంబుతో కలశాన్ని ఏర్పాటు చేయాలి. కలశానికి ముందు పండ్లు, నట్స్‌ను సిద్ధం చేసుకోవాలి. కలశానికి నూలు కట్టి.. మామిడి ఆకులు పెట్టి.. ఆపై కొబ్బరికాయను వుంచాలి. కలశంలో శుభ్రమైన నీటిని చేర్చి అందులో పచ్చకర్పూరాన్ని వేయాలి. కొబ్బరికాయపై పుష్పాలను వుంచాలి. తర్వాత ఆ కలశాన్ని లక్ష్మీదేవిగా భావించి.. ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. ఇలా వీలైనంత వరకు మూడు వారాల పాటు చేస్తే.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. 
 
కలశపూజ చేసేందుకు వీలుకాన్నట్లైతే లక్ష్మీదేవి ప్రతిమ లేదా పటాన్ని పూజకు సిద్ధం చేసుకుని.. ముందు నేతి దీపం వెలిగించి.. ఫలపుష్పాలు, పాలు, నట్స్ నైవేద్యంగా సమర్పిస్తే సరిపోతుంది. ఆపై దీపారాధన చేయాలి. తర్వాత 108 లక్ష్మీనామాలను పఠించాలి. ఇలా తొమ్మిది వారాలు చేసినట్లైతే.. ఆరోగ్యం, ఆయుర్దాయం, సంపదలు చేకూరుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. 
 
ఆ ఇంట నివసిస్తున్న కుటుంబ సభ్యులంతా క్షేమంగా వుంటారు. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వారి ఉన్నతికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆదాయానికి మార్గం లభిస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు, ఈతిబాధలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లభిస్తుంది. ఆ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిత్రమా.... ఎందుకు బాధ పడుతున్నావ్?