Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

అమెజాన్ పేరుతో బ్లాక్ ఫ్రైడే సేల్.. లింక్ క్లిక్‌ చేస్తే మటాష్...

Advertiesment
Amazon
, శుక్రవారం, 23 నవంబరు 2018 (14:01 IST)
సోషల్ మీడియా ప్రసారసాధనాల్లో ఒకటి వాట్సాప్. ఒక సమాచారాన్ని కొన్ని క్షణాల్లో ప్రపంచం నలమూలలకు చేరవేసే ప్రసార సాధనం. ఇలాంటి వాట్సాప్‌ను ఆధారంగా చేసుకుని సైబర్ హ్యాకర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో స్మార్ట్ ఫోన్లపై స్మార్ట్‌గా అటాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. 
 
నవంబరు 23వ తేదీ శుక్రవారం మీ జీవితంలో ఓ అద్భుతం రోజు. ఇలాంటి అవకాశం మళ్లీరాదు. ఆలసించిన ఆశాభంగం. వెంటనే త్వరపడండి. అంటూ ఓ సందేశం హల్‌చల్ చేస్తోంది. అదేంటో తెలుసా... బ్లాక్ ఫ్రైడే సేల్స్. ఈ పదం మనకు కొత్తగా ఉండొచ్చు. కానీ, బ్రిటన్, ఐర్లాండ్, అమెరికా ప్రజలకు బాగా సుపరిచితం. 
 
ఆయా దేశాల్లో యేడాదిలో ఒకటి రెండుసార్లు బ్లాక్ ఫ్రైడే పేరుతో సేల్స్ పలు కంపెనీలు సేల్స్ ప్రకటిస్తాయి. ఆరోజు ఆయా వస్తువులపై 90శాతం వరకు రాయితీ ఇస్తుంటాయి. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ కోసం అక్కడి వాసులు రెండు, మూడు రోజుల ముందు నుంచే క్యూలో నిలుచుంటారు. అలాంటి బ్లాక్ ఫ్రైడే సేల్స్.. మన దేశంలోని ఈ-కామర్స్ సైట్స్ కూడా నిర్వహిస్తున్నాయనే ఓ లింక్ వాట్సాప్ గ్రూప్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ లింక్ షేర్ చేసింది సైబర్ నేరగాళ్లు. 
 
పొరపాటున ఈ లింక్ క్లిక్ చేస్తే మీ స్మార్ట్ ఫోన్ మటాష్ అయినట్టే. ఈ లింక్ ఓపెన్ చేస్తే అచ్చం అమెజాన్ సైట్ లుక్‌లో ఉంటుంది. అన్ని వస్తువులు కనిపిస్తాయి. భారీ ఆఫర్స్ కూడా ఉంటాయి. వీటిని కొనుగోలు చేయాలి అంటే మీ వ్యక్తిగత వివరాలు ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. వీటితోపాటు మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు పొందుపరచాలి. వీటిని ఎంట్రీ చేసిన కొన్ని క్షణాల్లోనే మీ సమాచారమంతా హ్యాకర్స్ చేతిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత క్రెడిట్ లేదా డెబిట్ కార్డు‌తో ఏదో కొనుగోలు చేసినట్టు ఎస్ఎంఎస్ వస్తుంది. 
 
అందుకే వాట్సాప్‌లో చక్కర్లు కొట్టే ఇలాంటి లింకులను అస్సలు తాకరాదు. వచ్చిన వెంటనే డిలీట్ చేయాలి. పొరపాటు ఓపెన్ చేస్తే వివరాలు అన్నీ కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని, అలాంటి మెసేజ్‌లను వెంటనే డిలీట్ చేయాలని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొలిసారి పైలెట్‌గా అవతారం.. అమ్మమ్మ వద్ద విమానంలోనే ఆశీర్వాదం.. (వీడియో)