Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రదోష కాలంలో తులసి, కొబ్బరి నీళ్లు శివునికి ఇవ్వకూడదట!

సెల్వి
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (12:16 IST)
శివపూజలో ప్రదోష కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం సౌమ్య ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి, శుచియై శివ పార్వతులని మల్లెలతో పూజించాలి. 
 
శక్తి ఉన్నవాళ్లు ఉపవాసం ఉంటే చాలా మంచిది. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో సంధ్యా దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. శివాష్టకం పఠించాలి. 
 
సంధ్యాసమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకం, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి శివునికి సమర్పించాలి. ప్రదోష వ్రతం రోజు శివలింగానికి తులసి, కొబ్బరి నీళ్లు, కుంకుమ సమర్పించకూడదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజలను మోసం చేసేవాళ్లు గొప్ప నాయకులు : నితిన్ గడ్కరీ

KCR: సీబీఐకి కాళేశ్వరం కేసు.. కేసీఆర్, హరీష్ రావులు అరెస్ట్ అవుతారా?

ఏపీలో మెడ్‌టెక్ జోన్.. వైజాగ్‌లో మెడ్‌టెక్ విశ్వవిద్యాలయం -గ్లోబ్ ఆకారంలో గాజు భవనం

మైసూర్ వేడుకల స్ఫూర్తితో విజయవాడ ఉత్సవ్ - గొల్లపూడిలో 30 ఎకరాల ఎక్స్‌పో

నారా లోకేశ్‌ను 'ప్రజా గొంతుక' అంటూ అభివర్ణించిన నటుడు ఎవరు?

అన్నీ చూడండి

లేటెస్ట్

గణపతి ఉత్సవాల కోలాహలం: మంగళహారతి పాడుదాం రండి

Saturday Saturn Remedies: శనివారం నల్లనువ్వులు, ఆవనూనెతో ఇలా చేస్తే.. రావిచెట్టులో శనిగ్రహం..?

29-08-2025 శుక్రవారం ఫలితాలు - ఆప్తుల చొరవతో సమస్య పరిష్కారం....

Sankata Nasana Ganesha Stotram: సంకట నాశన గణేశ స్తోత్రాన్ని రోజూ పఠిస్తే..?

28-08-2025 గురువారం రాశిఫలాలు - ఎదుటివారి అంతర్యం గ్రహించండి.. భేషజాలకు పోవద్దు...

తర్వాతి కథనం
Show comments