Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

Advertiesment
Bilva Leaves

సిహెచ్

, శనివారం, 8 ఫిబ్రవరి 2025 (18:28 IST)
బిల్వ పత్రం. ఇది పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరం అని విశ్వాసం. ఈ బిల్వ పత్రంలో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకును మారేడు ఆకు అంటారు. దీనితో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
బిల్వ పత్రం అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.
మారేడులో విటమిన్లు ఎ, బి1, బి2, సి, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఇనుముతో కూడిన అనేక పోషకాలున్నాయి.
బిల్వ పత్రంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది.
బిల్వ పత్రంలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి మేలు చేస్తుంది.
మారేడు ఆకులలో ధమనులు గట్టిపడకుండా నిరోధించే గుణం వుంది. గుండె జబ్బులను నివారిస్తుంది.
మారేడులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలను బలోపేతం చేయడానికి, బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది.
బిల్వలో వుండే ఇనుము రక్తంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది.
మారేడుతో గుండె- కాలేయ వ్యాధులకు వ్యతిరేకంగా శక్తివంతంగా పనిచేస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి