రథ సప్తమి: సూర్యునికి ఇలా పూజ.. చిక్కుడు కాయలు, పరమాన్నం...

సెల్వి
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (14:02 IST)
రథ సప్తమి ఈ ఏడాది ఫిబ్రవరి 4, 2025న వస్తోంది. మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. రథ సప్తమి రోజున సూర్యభగవానుడిని పూజించి ఆవు పాలతో తయారు చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
సూర్యుడికి ఈ రోజున పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. పిడకలపై వుంచిన పాత్రలో పాలు, బెల్లం, కొత్త బియ్యంతో పరమాన్నం చేస్తారు. చిక్కుడు ఆకుల్లో దాన్ని పెట్టి స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. చిక్కుడు కాయలతో రథం చేసి.. అందులో అక్షింతలు వుంచి సూర్యుడిని ఆవాహన చేస్తారు. సూర్యుడికి ఎరుపు రంగు ప్రీతికరం కాబట్టి ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. గోధుమలు, ఎర్రటి పువ్వులు దానంగా ఇవ్వాలని పెద్దలు అంటున్నారు. 
 
అలాగే రథసప్తమి రోజున తిరుమలలో బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. అరసవెల్లిలోని సూర్య నారాయణ ఆలయంలో ఈ రోజున సూర్యుని కిరణాలు ఆలయంలోని మూల విరాట్టు పాదాలను తాకుతాయి. 
 
రథసప్తమి నాడు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి సమీపంలో నది లేదా సముద్రం ఉంటే స్నానం చేయాలి. లేదంటే ఇంట్లోనే జిల్లేడాకుల నీటితో తలస్నానం ఆచరించాలి. ఇంటిని శుభ్రం చేసి దీపాలు వెలిగించాలి. ఎక్కువ మంది నది లేదా సముద్ర తీరంలో సూర్య భగవానుని పూజిస్తారు. 
 
సూర్యోదయం కాకముందే పూజ అంతా పూర్తి చేయాలి. రేగి పండ్లు, చెరకు, పాయసం ఇలా అన్నింటితో సూర్య భగవానికి నైవేద్యం సమర్పించాలి. ఇంకా సూర్య పారాయణం, ఆదిత్య హృదయం పఠించాలి. రథసప్తమి రోజున సూర్య ఆరాధన నవగ్రహ దోషాలను తొలగిస్తాయి. కోరిన కోరికలు నెరవేరాలంటే రథ సప్తమి రోజున సూర్య ఆరాధన చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

తర్వాతి కథనం
Show comments