సరస్వతి దేవి జన్మించిన రోజును వసంత పంచమిగా జరుపుకుంటారు. అలాగే కొన్ని కథనాలు బ్రహ్మ సృష్టిలో విద్య, సంగీతం, కళలకు ప్రతీకగా సరస్వతి దేవిని సృష్టించాడని చెబుతున్నాయి. అందుకే విద్యార్థులు ఈ రోజున పుస్తకాలను, పెన్నులను, అక్షరాలను పూజిస్తే విద్యాబుద్ధులు లభిస్తాయని నమ్ముతారు.
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ పిల్లల భవిష్యత్తులో విద్య అభ్యసించాలనే సరస్వతి దేవి కోరుకుంటారు. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తే చదువులో రాణించి మంచి విజయాలను అందుకుంటారని నమ్మకం. ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం నాడు వచ్చింది.
ఈ రోజు పూజలో భాగంగా సరస్వతీ వందనం మరియు సరస్వతి మంత్రాలను పఠించాలి. నైవేద్యంలో భాగంగా పసుపు రంగులో ఉండే మిఠాయిలను పెట్టడం వలన ఎంతో మంచి జరుగుతుంది. కేవలం విద్యార్థులు మాత్రమే కాకుండా అందరూ అమ్మవారిని పూజించవచ్చు. పెళ్లయిన వారు అమ్మవారిని పూజించడం వలన వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది.
ఇదే రోజున న్యాయం, కర్మలకు అధిపతి అయిన శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత వసంత పంచమి రోజున కుంభరాశిలో శష రాజయోగం ఏర్పరచనున్నాడు. వసంత రుతువులో శష రాజయోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు రానున్నాయి.
ఈ యోగం ద్వారా బుధ, గురు, శుక్ర గ్రహాల బలం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మేషం, మిథునం, తులా, సింహ రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.