Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

Advertiesment
Moon

సిహెచ్

, శనివారం, 1 ఫిబ్రవరి 2025 (20:25 IST)
విశ్వం అంటేనే ఓ అంతుచిక్కని రహస్యం. అందులో ఎన్నో నక్షత్రాలు, వాటికి గ్రహాలు. ఈ విశ్వ రహస్యాలను తెలుసుకునేందుకు శాస్త్రజ్ఞులు అనునిత్యం ప్రయత్నిస్తూనే వుంటారు. మన సౌర వ్యవస్థకు సంబంధించి మన భూమితో పాటు మిగిలిన 8 గ్రహాల చరిత్రను తెలుసుకునేందుకు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. జాబిల్లి చంద్రుడు పైకి ఇప్పటికే మానవుడు కాలు మోపాడు. ఐనప్పటికీ చంద్రుడు పుట్టుపూర్వోత్తరాల గురించిన పరిశోధనలు జరుగుతూనే వున్నాయి.
 
భూమికి ఉపగ్రహం అయినటువంటి చంద్రుడు భారీ విధ్వంసం నుండి పుట్టాడనేది శాస్త్రవేత్తల వాదన. సౌర వ్యవస్థ ఏర్పడిన సమయానికి, దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం... అంటే కనీసం అంగారక గ్రహం పరిమాణంలో ఉన్న ఒక వస్తువో లేదంటే వస్తువుల శ్రేణి నేరుగా భూమిని ఢీకొట్టడంతో చంద్రుడి సృష్టి జరిగిందని చెబుతారు.
 
ప్రారంభ సౌర వ్యవస్థ అస్తవ్యస్తంగానూ భయంకరమైన ప్రదేశంగా ఉండేదని చెప్తారు. సూర్యుడు ఏర్పడినప్పటి నుండి మిగిలిపోయిన శిథిలాలు నక్షత్రం చుట్టూ ఒక వలయంలా కలిసిపోయాయి. ఇలా ఏర్పడినవే నేడు మనకు తెలిసిన గ్రహాలు, చంద్రులు, గ్రహశకలాలు. చంద్రుడు ఎలా ఏర్పడ్డాడనేదాన్ని... అంటే 4.5 బిలియన్ ఏళ్ల క్రితం జరిగిన ప్రక్రియను నాసా 2 నిమిషాల నిడివి గల వీడియో ద్వారా చూపించింది. మీరు కూడా చూసేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు