Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా ప్రదోషం రోజున.. పంచదారతో శివునికి అభిషేకం చేయిస్తే?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (16:04 IST)
Sugar
శని మహాప్రదోషం అయిన శనివారం (ఆగస్టు 1) రోజు శివాలయాలకు వెళ్లడం.. అక్కడ జరిగే అభిషేకాలు, ఆరాధనలు కనుల ద్వారా వీక్షించడం ద్వారా సకలపాపాలు తొలగిపోతాయి. ఇంకా ఐదేళ్ల పాటు శివాలయాల దర్శన ఫలితాలు చేకూరుతాయి. ప్రదోష సమయంలో నందీశ్వరునికి గరిక మాల, ఎరుపు రంగు  బియ్యం, నేతిలో దీపం వెలిగించడం ద్వారా సుభీక్షం ప్రాప్తిస్తుంది.
 
శనివారం పూట రోజంతా వ్రతమాచరించి.. సాయంత్రం పూట ప్రదోష సమయాన శివాలయ దర్శనం చేయాలి. ప్రదోష సమయంలో శివాలయాల్లో జరిగే ప్రత్యేక అభిషేకాల్లో పాల్గొనాలి. శివునికి పాలు, పెరుగు, చందనం, పన్నీర్, విభూతి వంటితో అభిషేకం చేయించాలి. అలాగే బిల్వం, తామర పువ్వులతో అర్చన చేశాక ఆలయ ప్రదక్షణ చేయాలి. అభిషేకం కోసం నూనె, పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు వంటివి ఇవ్వడం చేయొచ్చు. నందీశ్వరునికి అభిషేకంతో పాటు ఈశ్వరునికి జరిగే అభిషేకాలను వీక్షించాలి. 
 
అలా ప్రదోషకాలం జరిగే అభిషేకాలు.. వాటి ఫలితాలేంటో తెలుసుకుందాం.. 
పాలు- వ్యాధులు తీరిపోతాయి. ఆయుర్దాయం పెరుగుతుంది. 
పెరుగు- సంతోషకరమైన జీవనం 
తేనె- వాక్చాతుర్యం 
పండ్లు - ధనధాన్య వృద్ధి 
నెయ్యి- ముక్తి 
పంచామృతం- ఐశ్వర్యం 
కొబ్బరిబోండాం - సంతానప్రాప్తి
పంచదార- శత్రుబాధ వుండదు
నూనె- సుఖ జీవితం 
చందనం- కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 
పుష్పాలు - శివుని అనుగ్రహం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలి.. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్

Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్‌కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఇంట్లోనే వుండండి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ (video)

Hyderabad floods: హైదరాబాదులో భారీ వర్షాలు- హుస్సేన్ సాగర్ సరస్సులో భారీగా వరదలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

తర్వాతి కథనం
Show comments