Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-08-2020 శనివారం రాశిఫలాలు - ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులను...

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (05:00 IST)
మేషం : మీ బలహీనతను కొంతమంది స్వార్థానికి వినియోగించుకుంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడికానవస్తుంది. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ప్రముఖులతో సంప్రదింపులు, చర్చలు ఫలిస్తాయి. 
 
వృషభం : సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ శ్రీమతి మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. నూతన ప్రదేశాల సందర్శనలు అనుకూలం. 
 
మిథునం : ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సమస్యలు చక్కబడతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఒక కార్యంనిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయంలో ఏకాగ్రత వహించండి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. 
 
కర్కాటకం : స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఏ వ్యక్తినీ అతిగా నమ్మడం మంచిదికాదు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్యను అధకమిస్తారు. చేపట్టిన ఉపాథి పథకాలు మందకొడిగా సాగుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాకయం. 
 
సింహం : ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ధనవ్యయం అధికంగా ఉంటుంది. చిట్స్, ఫైనాన్స్, వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. చీటికి, మాటికి ఎదుటివారిపై అసహనం ప్రదర్శిస్తారు. 
 
కన్య : కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిదికాదు. ఒప్పందాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల మీద మక్కువ పెరుగుతుంది. ఏజెంట్లు, బ్రోకర్లు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
తుల : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిదికాదు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
వృశ్చికం : విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థికస్థితి కొంత మెరుగనిపిస్తుంది. అకాల భోజనం, శారీరక శ్రమ వంటి ఇబ్బందులెదుర్కొంటారు. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. 
 
ధనస్సు : ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాలవారికి మిశ్రమ ఫలితం. నిరుద్యోగులు, వృత్తులవారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో నష్టాలను కొంతమేరకు అధికమిస్తారు. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. హోదాలో ఉన్న అధికారులు అపరిచితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది. 
 
మకరం : ఇతరులకు పెద్ద మొత్తంల ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. వృధా ఖర్చులు, అధికంగా ఉంటాయి. ఆత్మీయులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. 
 
కుంభం : ప్రతి విషయం మీ జీవితభాగస్వామికి తెలియజేయడం మంచిది. నూతన పెట్టుబడుల వ్యవహారంలో ఒక నిర్ణయానికి వస్తారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. స్త్రీలకు ఆరోగ్యం తగు జాగ్రత్తలు అవసరం.
 
మీనం : స్థోమతకు మించిన వాగ్ధానాల వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. అనుకున్న పనులు అర్థాంతరంగా ముగిస్తారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు నెరవేరగలవు. మీ యత్నాలు ఫలించకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. ఎలక్ట్రానికి మీడియా వారికి సదావకాశాలు లభిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

తర్వాతి కథనం
Show comments